//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన కీసర గట్టు విశిష్టత ఇదే

Category : editorial

మహాశివరాత్రి పురస్కరించుకుని మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట ఆలయం ముస్తాబైంది. ఆధ్యాత్మిక శోభతో భక్తులను ఆకట్టుకునేందుకు సిద్ధం అయ్యింది. శనివారం (02.03.2019) నుంచి గురువారం (07.03.2019) వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న ఈ వేడుకలను పకడ్బందీగా నిర్వహించడానికి సన్నద్ధమైంది. ఈ నేపధ్యంలోనే కీసర గట్టు క్షేత్ర విశేషాలు మీ కోసంకీసర లేదా కీసరగట్టు అని పిలిచే ఈ శైవ క్షేత్రం పురాణ ప్రాధాన్యత కలిగినదే కాకుండా చారిత్రాత్మకంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందినది. తెలంగాణ లోని మేడ్చల్ జిల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్రం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది.కీసర లేదా కీసరగట్టు అని పిలిచే ఈ శైవ క్షేత్రం పురాణ ప్రాధాన్యత కలిగినదే కాకుండా చారిత్రాత్మకంగా కూడా ఎందో ప్రసిద్ధి చెందినది. తెలంగాణ లోని మేడ్చల్ జిల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్రం ఆ రాష్ట్ర రాజధాని నుంచి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది.
ఈ క్షేత్రం ఏర్పాటునకు సంబంధించిన స్థల పురాణం ప్రకారం రామ, రావణ యుద్ధం తర్వాత అయోధ్యకు వెలుతూ మార్గమధ్యలో ఈ కీసరగట్టు ప్రాంతాన్ని రాముడు చూస్తాడు. ఇక్కడిప్రకృతి సౌందర్యానికి రాముడు ముగ్దుడవుతాడు.అంతేకాకుండా ఈ కీసరగట్టు ప్రాంతం మరింత అభివృద్ధి చెందడం కోసం ఒక శివలింగాన్ని ప్రతిష్టించాలని భావిస్తాడు. ఇందుకు అక్కడ ఉన్న మునులతో పాటు రాముడి పరివారంలో ఉన్న పెద్దలు కూడా అంగీకరిస్తాడు.అయితే శివలింగం కాశీ నుంచి తీసుకువచ్చి ప్రతిష్టిస్తే ఈ క్షేత్రానికి మరింత శోభ చేకూరుతుందని భావించిన శ్రీరాముడు ఇందు కోసం హనుమంతుడిని కాశీకి పంపిస్తాడు.
ఆకాశమార్గాన కాశీ క్షేత్రాన్ని చేరుకున్న హనుమంతుడు పరమశివుడిని ప్రార్థిస్తాడు.ఆ పుణ్యక్షేత్రంలో పరమశివుడు అంజనీ పుత్రుడైన హనుమంతుడికి 101 శివలింగాల రూపంలో దర్శనమిస్తాడు. దీంతో పరమానందభరితుడైన హనుమంతుడు ఆ నూటొక్క శివలింగాలను తీసుకొని కీసరగట్టుకు బయలుదేరుతాడు.ఇదిలా ఉండగా కీసరగట్టులో శివలింగం ప్రతిష్టాపనకు నిర్ణయించిన సుమూహుర్త ఘడియలు సమీపిస్తున్నా కూడా హనుమంతుడు కీసరగట్టకు చేరుకోలేక పోతాడు. దీంతో శ్రీరాముడు పెద్దల అనుమతితో అక్కడే ఉన్న ఓ రాతిని శివలింగంగా మార్చి ప్రతిష్టాపన చేస్తాడు. దీనినే శ్రీరామ లింగేశ్వరస్వామి అని పిలుస్తారు.


అటు పై హనుమంతుడు 101 శివలింగాలతో కీసరగట్టకు చేరుతాడు. అయితే అప్పటికే శివలింగం ప్రతిష్టాపన జరిగిపోవడంతో కోపంతో తాను తెచ్చిన 101 శివలింగాలను గుట్ట పై చల్లాచదురుగా విసిరేస్తాడు. ఆ లింగాలనే మనం గుట్ట పై ఇప్పటికీ అక్కడక్కడ చూడవచ్చు.అటు పై శ్రీరాముడు హనుమంతుడిని అనునయించి ఈ భూమండలం ఉన్నంత వరకూ ఈ క్షేత్రం నీ పేరుతో కేసరి గిరిగా వర్థిల్లుతుందని చెబుతాడు. దీంతో శాంతించిన హనుమంతుడు తాను తెచ్చిన శివలింగాల్లో ఒకదానిని శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగం ఎడమ వైపున ప్రతిష్టించి పూజలు చేస్తాడు. దీనినే ప్రస్తుతం మనం మారుతీ కాశీ విశ్వేశ్వర శివలింగంగా అర్చన చేస్తున్నాం.కాలక్రమంలో కేసరగిరి క్షేత్రం కీసరగుట్టుగా మార్పు చెందింది. ఇక్కడ స్వామి వారు పశ్చిమాభిముఖంగా ఉండటం విశేషం. ఇలా దేవాలయాల్లో మూలవిరాట్టు పశ్చిమాభిముఖంగా ఉండటం చాలా అరుదు. ఇళా పశ్చిమాభిముఖంగా ఉన్న క్షేత్రాల్లో కోరిన కోర్కెటు త్వరగా తీరుతాయని చెబుతుంటారు.
పురాణ పరంగానే కాకుండా చారిత్రాత్మకంగా కూడా ఈ క్షేత్రానికి అధిక ప్రాధాన్యత ఉంది. క్రీస్తుశకం 4వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం వరకూ ఆంధ్ర దేశాన్ని పరిపాలించిన విష్ణుకుండిన రాజవంశానికి ఈ కీసరగుట్టుతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు పురావస్తు శాఖ ఇక్కడ జరిపిన తవ్వకాలతో తేట తెల్లమయ్యింది.విష్ణుకుండిన రాజవంశానికి చెందిన రెండవ మాధవ వర్మ ఈ కీసరగుట్టులో 11 అశ్వమేధ యాగాలతో సహా మొత్తం 1000 యాగాలు చేశాడు. దీంతో ఆ యాగ ఫలాల వల్ల ఈ క్షేత్రం శక్తి రెట్టింపయినట్లు చెబుతారు. అందువల్లే కష్టాల్లో ఉన్నవారుఈ క్షేత్రాన్ని సందర్శిస్తే మంచి జరుగుతుందని చెబుతారు.కీసరగుట్టలో పురావస్తు శాఖ దాదాపు 3 చదరపు కిలోమీటర్ల పరిధిలో జరిపిన తవ్వకాల్లో ఒక శిథిలమైన కోట, భవనాలు, బంగారు, వెండితో సహా వివిధ లోహాలతో తయారు చేసిన ఆభరణాలు, అలంకార వస్తువులతో పాటు యాగ కుండాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా విష్నుకుండినులు తెలుగు భాషను అధికార భాషగా మొట్టమెదట గుర్తించినది ఇక్కడి శాసనాల ద్వార వెలుగు చూసింది.
క్రీస్తుశకం 17వ శతాబ్దంలో గోల్కొండ కుతుబ్ షాహీ వంలోని అబ్దుల్ హసన్ తానీషా నవాబు వద్ద మహా మంత్రులుగా పనిచేసే అక్కన్న, మాదన్నలు కీసరగుట్టలోని శ్రీరామలింగేశ్వరస్వామిని దర్శించి ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రంగా అభివృద్ధి చేశారు.ఇందుకోసం హిందూ, మహ్మదీయ సమ్మిళిత సంప్రదాయం ఉట్టిపడేలా ఇక్కడ దేవాలయాన్ని నిర్మించి అందులో శ్రీ లక్ష్మి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ దేవాలయం వెనుక ఒక ఏకశిలా విజయ స్థూపం ఉంది. ఈ స్తంభం పై దశావతారాల రూపాలతో పాటు గణపతి, ఆంజనేయ విగ్రహాలు చూడముచ్చటగా ఉంటాయి. మొత్తానికి చారిత్రక, పౌరాణిక ఆధారాలను బట్టి మహా మహిమాన్విత సాక్షాత్తు ఆ శ్రీరామ చంద్రుడే ప్రతిష్టించిన లింగంగా ఇక్కడ స్వామీ వారు భక్తుల పూజలు అందుకొంటున్నారు.