//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సీఎం సంచలన ప్రకటన.....!

Category : politics

ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన ప్రకటన చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిని బహిరంగంగా ఉరి తీస్తామని పేర్కొన్నారు.

భోపాల్‌లో ఇవాళ ఆయన మహిళల కోసం కొత్తగా ముఖ్యమంత్రి మహిళా కోశ్ పథకాన్ని ఆవిష్కరించారు. వివాహం కాని 50 యేళ్లు పైబడిన ఒంటరి మహిళలకు ఈ పథకం కింద పెన్షన్ అందించనున్నట్టు ప్రకటించారు.

మహిళలు లేకుండా ఒక్కరోజు కూడా ఏ పనీ జరగదని గుర్తుంచుకోవాలన్నారు. అసలు మహిళలు లేకుండా ఇళ్లు ఎలా నడుస్తుందని అయన అన్నారు. మహిళలు లేకుండా దేశం, ప్రపంచం ముందుకు నడవడం కుదురుతుందా అని ఆయాన ప్రశ్నించారు. ఇది అసాధ్యం అని చెప్పాడు మన దేశంలో ఎప్పటినుంచో స్త్రీలను ఆరాధించడం, గౌరవించడం సంప్రదాయంగా వస్తోంది. ఇవాళ మహిళలు అనేక కీలక హోదాల్లో రాణిస్తున్నారు, అని చౌహాన్ పేర్కొన్నారు

Related News