//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీజేపీ తరుపున బరిలోకి దిగనున్న మాధురి దీక్షిత్‌

Category : politics

ప్రముఖ బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తుంది . 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో పూణె లోక్‌సభ స్థానం నుంచి ఆమెను బరిలోకి దించేందుకు బిజెపి సిద్దమైంది.

ఈ ఏడాది జూన్‌లో సంపర్క్‌ ఫర్‌ సమర్ధన్‌ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా మాధురీ దీక్షిత్‌ ఆమె నివాసంలో కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బిజెపి చేపట్టిన కార్యక్రమాలు ,మోది ప్రభుత్వ అభివృద్దిని వివరించారు. పూణె లోక్‌సభ స్థానానికి చేసిన షార్ట్‌లిస్టులో మాధురీ దీక్షిత్‌ పేరు ఉన్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో ఆమె పోటీలోకి దించే విషయంలో పార్టీ చాలా సీరియస్‌గా ఉందన్నారు.

Related News