//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తనపై హత్యా కుట్ర అని మధు యాష్కీ షాకింగ్ కామెంట్ .... కుట్ర చేసింది కవిత అంటున్న యాష్కీ

Category : politics state

తెలంగాణా ఎన్నికల నేపధ్యంలో జరిగిన ప్రచారంలో మాటల తూటాలు పేలాయి. అయితే పోలింగ్ కూడా ముగిసిన నేపధ్యంలో అంతా చల్లగానే వుంది అని భావిస్తే మళ్ళీ నేతలు వాగ్బాణాలు సంధిస్తున్నారు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. దాడులు, ప్రతి దాడులతో , చిన్న చిన్న ఘటనలతో పోలింగ్ ముందు రోజు రాత్రి, పోలింగ్ నాడు కకస్థ ఇబ్బంది తలెత్తినా మొత్తానికి పోలింగ్ ముగిసింది. ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే తెలంగాణ పోలింగ్ కు ముందురోజు తనపై జరిగిన దాడి గురించి కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపి మధు యాష్కి షాకింగ్ కామెంట్ చేశారు. హైదరాబాద్ నుండి నిజామాబాద్ కు వెళుతుండగా మార్గమధ్యలో మెట్ పల్లిలో తనపై దాడి జరిగిందన్న ఆయన ఇది కేవలం దాడి మాత్రమే కాదని....టీఆర్ఎస్ పార్టీ తనను చంపడానికి చేసిన ప్రయత్నమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేత స్థానిక నాయకుడు కొమ్మిరెడ్డి రాములు అనుచరుల పేరుతో టీఆర్ఎస్ కార్యకర్తలే తనపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. మూడు రోజుల క్రితమే తనపై దాడికి ప్లాన్ జరిగిందన్నారు. తనపై దాడి జరిగిన తర్వాత ఎంపి కవిత స్థానిక మాజీ ఎమ్మెల్యే‌తో పాటు కొమ్మి రెడ్డి రాములుకు ఫోన్ చేసినట్లు తమకు సమాచారం ఉందని మధుయాష్కి ఆరోపించారు. తనపై దాడిలో కల్వకుంట్ల కవిత పాత్ర వుందని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో నాలుగున్నరేళ్ల కల్వకుంట్ల కుటుంబ పాలనకు కాలం చెల్లిందని చెప్పిన మధుయాష్కీ నిన్నటి ఓట్ల సరళిని బట్టి చూస్తే తెలుస్తోందని అన్నారు. తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి మళ్లీ గడీల పాలన తీసుకువచ్చిన వారిని ప్రజలు వ్యతిరేకించారని తెలిపిన ఆయన తెలంగాణ పోలింగ్ కు ముందురోజు తనపై జరిగిన దాడి టీఆర్ ఎస్ కుట్రగా అభివర్ణించారు.

గత ఎన్నికల్లో తమకు ప్రాతినిధ్యం కూడా లేని జిల్లాల్లో కూడా ఈసారి అధికంగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేసిన ఆయన చేసిన ఆరోపణలు షాకింగ్ గా అనిపించాయి.

Related News