Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీలో చేరికకు మద్దిశెట్టి ఓకే

Category : politics state

దర్శి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి విషయంపై ఒక స్పష్టత ఏర్పడింది. తాను పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని మద్దిశెట్టి వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. శుక్రవారం ఆపార్టీ అధినేత జగన్‌ను కలిసి ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. వెంటనే రంగంలోకి రావాలని జగన్‌ ఆయనకు సూచించగా సంక్రాంతి తర్వాత పార్టీ కార్యక్రమాలను ప్రారంభిస్తానని వేణుగోపాల్‌ చెప్పారు. వివిధ కారణాలతో దర్శి నియోజకవర్గ వైసీపీ సమ న్వయకర్త పదవి కొన్ని నెలల నుంచి ఖాళీగా ఉంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున దర్శి నుంచి పోటీ చేసిన వేణుగోపాల్‌ అంగీకరిస్తే ఆ బాధ్యతలు ఆయనకు అప్పగించాలని నెల క్రితమే జగన్‌ నిర్ణయించుకున్నారు.

Related News