//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాంగ్రెస్ కు మాయావతి షాక్ .. కారణం ఆయనే

Category : politics national

ఆమె దేశ రాజకీయాల్లో కీలకమైన నేత.ఆమెతో మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాల్సిన పెద్ద మనిషి ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడాడు. ఆమె పార్టీని తక్కువ చేశాడు... దీంతో ఆమె ఆగ్రహంతో సింగిల్ గా ఎన్నికల బరిలోకి దిగుతానని తేల్చి చెప్పింది. ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో పడింది ఆమె స్నేహ హస్తాన్ని అందుకోవాలని చూసిన హస్తం పార్టీ .

దేశ వ్యాప్త ఎన్నికలకు సిద్ధం అవుతున్న తరుణంలో యూపీలోనే కాదు నాలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపగల నేత బీఎస్పీ అధినేత మాయావతి. గ‌త కొంత కాలంగా కాంగ్రెస్ కు మాయావతి వ్య‌తిరేకంగా మార‌డం కాంగ్రెస్ వ‌ర్గాల్ని ఇబ్బందికి గురి చేస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్త‌ర ప్ర‌దేశ్ రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. నిన్న‌టి వ‌ర‌కు స్నేహం చేసిన బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇప్పుడు కయ్యానికి కాలు దువ్వుతుంది. దీనికి కార‌ణం కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్. దిగ్విజయ్ పెట్టిన పంచాయితీతో దీదీ వేస్తున్న కొత్త ఎత్తులు కాంగ్రెస్ కు త‌ల‌నొప్పిగా మారుతున్నాయి. అసలు దిగ్విజయ్ సింగ్ ఏం చేశాడంటే .. Maayavathi Gives Bigshock to congress

బీజేపీ ని దెబ్బ తీసే లక్ష్యంతో కలిసొచ్చే ప్రాంతీయ పార్టీల పొత్తులతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల పొత్తు కోసం ఇరు పార్టీలు స‌మాలోచ‌న‌లు చేస్తున్న వేళ మాయావ‌తిపై బాంబు పేల్చి మాయావతికి చిర్రెత్తుకొచ్చేలా చేశాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తల పండిన నేత దిగ్వ‌జ‌య్‌. దీనితో ఆగ్ర‌హించిన దీదీ సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీని దేబురించాల్సిన ఖ‌ర్మ త‌న‌కు ప‌ట్ట‌లేద‌ని, ఉత్త‌ర ప్ర‌దేశ్‌తో పాటు రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రాల్లో ఒంట‌రిగానే పోటీకి దిగుతామ‌ని ప్ర‌క‌టింఛి కాంగ్రెస్ కు ఝలక్ ఇచ్చింది.

కేంద్రంలో బీజేపీ సర్కార్ ను గద్దె దించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ కలిసొచ్చే పార్టీల పొత్తులతో ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే పొత్తుల చర్చ జరుగుతుంటే మాయావతి పార్టీని అవమానించినట్టు మాట్లాడారు దిగ్విజయ్. దీంతో మాయావతి తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ ను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆయా రాష్ట్రాల్లో బీఎస్పీ త‌మ‌తో క‌ల‌వ‌కుండా కాంగ్రెస్ ఒంట‌రిగా పోటీ చేయ‌డం అంటే బీజేపీకి లాభం చేయ‌డ‌మే అవుతుంది. ముఖ్యంగా వ‌సుంధ‌రారాజేపై ఉన్న అసంతృప్తిని కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చుకోవ‌డం, అక్క‌డ జెండా ఎగ‌రేయ‌డం క‌ష్టంగా మారే అవ‌కాశం వుంటుంది. అంతే కాకుండా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోనూ మాయావతి ప్ర‌భావం భారీగానే వుండే అవ‌కాశం వుంది.

ఈ నేపధ్యంలో ఎలాగైనా దీదీని మళ్ళీ త‌మ‌వైపు తిప్పుకునే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. కానీ దీదీ కాంగ్రెస్ చేసే ప్రయత్నాలకు స్పందిస్తుందా లేదా ... దిగ్విజయ్ చేసిన పనిని మన్నిస్తుందా అనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది.