ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సైబర్ దాడి జరిగింది.భారత్ సహా 74 దేశాల్లో ఒకేరోజు సైబర్ నేరగాళ్లు 45వేల హ్యాకింగ్‌లకు పాల్పడ్డారని రష్యా రాజధాని మాస్కోలోని సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కై ల్యాబ్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఉన్నట్లుండి వేల సంఖ్యలో కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. దీంతో అత్యవసర సేవలు కూడా స్తంభించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధమంగా బ్రిటన్‌లోని పలు ఆసుపత్రులపై సైబర్ దాడి జరిగింది. ఐటీ వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కంప్యూటర్లు తిరిగి పనిచేయాలంటే డబ్బులు చెల్లించాలన్న సందేశం తెరలపై కనబడటంతో అధికారులు విస్తుపోయారు. ఏం జరిగిందా అని ఆరా తీసే లోపే, ఈ దాడి ప్రపంచమంతా పాకింది. ‘వానా క్రై రాన్సమ్వేర్’ ద్వారా కంప్యూటర్లను హ్యాక్ చేసినట్లు తెలిసింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 74 దేశాల్లో 45వేల సైబర్ దాడులు జరిగినట్లు కాస్పర్‌స్కై ల్యాబ్ తన బ్లాగ్‌లో పేర్కొంది. దీనిలో ఎక్కువగా రష్యాలోనే హ్యాకింగ్‌కు గురయ్యాయట.
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఎస్‌ఎంబీవీ2 అనే రిమోట్‌కోడ్‌తో ‘వానా క్రై’ అనే రాన్సమ్వేర్తో హ్యాకర్లు దాడి చేసినట్లు సమాచారం. మొదట ఇంగ్లాండ్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ సైబర్ దాడిలో చాలా ఆసుపత్రిల్లోని అత్యవసర సేవలు స్తంభించాయి. అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి. కంప్యూటర్లను అన్‌లాక్ చేయాలంటే 300 డాలర్లు ఇవ్వాలన్న సందేశం కనిపించిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.