//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

"లవర్స్‌ డే" సినిమా రివ్యూ

Category : movies

టైటిల్ : లవర్స్‌ డే

తారాగణం: ప్రియా ప్రకాశ్‌ వారియర్, నూరిన్ షెరిఫ్‌ తది తరులు ...

ఛాయాగ్ర‌హ‌ణం: శీను సిద్ధార్థ్‌

జానర్ : లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌

కూర్పు: అచ్చు విజ‌య‌న్‌

సంగీతం: షాన్ రెహ‌మాన్‌

స్క్రీన్‌ప్లే: సారంగ్ జ‌య‌ప్ర‌కాష్‌ లిజో ప‌నాడా

నిర్మాత‌లు: ఎ. గురురాజ్‌, సి.హెచ్‌. వినోద్‌రెడ్డి

క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఒమ‌ర్ లులు

సంస్థ: సుఖీభవ సినిమాస్

విడుదల: 14 ఫిబ్రవరి 2019

కేవలం కన్నుకొట్టి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుని సోషల్ మీడియాలో సంచలన నటిగా మారింది ప్రియా ప్రకాష్ వారియర్. ఆమె క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఆమె నటించిన ‘ఒరు ఆదార్ లవ్’ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో డబ్ చేశారు. సెలబ్రేట్ లవ్ అంటూ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వింక్ బ్యూటీ ప్రియా వారియర్ ‘లవర్స్ డే’ మూవీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా తెలుగు, మలయాళంతోపాటు కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో విడుదల నేడు (ఫిబ్రవరి 14)న విడుదల చేస్తున్నారు.ఈ చిత్రం ఎలా ఉందో ఒక్కసారి తెలుసుకుందాం..

అసలు కథ :

ఇంట‌ర్‌మీడియట్ కాలేజీ నేప‌థ్యంలో సాగే ప్రేమకథ ఇది. రోష‌న్ (రోష‌న్‌), ప్రియా (ప్రియా వారియ‌ర్‌), గాథ జాన్ (నూరిన్ షెరిఫ్‌), మాథ్యూ (మాథ్యూ జోసెఫ్‌), ప‌వ‌న్ (వైశాఖ్ ప‌వ‌న‌న్)... వీళ్లంతా స్నేహితులు. ఒకే త‌ర‌గ‌తిలో చ‌దువుతుంటారు. వీళ్ల‌లో రోష‌న్‌, ప్రియా తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తారు. ఆ ఇద్ద‌రూ ఒక్క‌టి కావ‌డానికి గాథ సాయ‌ప‌డుతుంది. రోషన్.. గాధ స్నేహితులుగా మొదలై ప్రేమికులుగా మారిపోతారు. అయితే వారి ప్రేమను వ్యక్త పరిచాలనుకునే సమయానికి అనుకోని సంఘటన జరుగుతుంది. ఇంత‌లో కాలేజ్‌ వాట్సాప్ గ్రూప్‌లో పెట్టిన కొన్ని వీడియోల వ‌ల్ల రోష‌న్‌కు, ప్రియాకు మ‌ధ్య దూరం పెరుగుతుంది. ప్రియా బ్రేక‌ప్ చెబుతుంది. విడిపోయిన ప్రేమికుల్ని మ‌ళ్లీ ఒక్క‌టి చేయాల‌ని... ప్రియాలో ఈర్ష్య క‌లిగించాల‌ని స్నేహితులంతా క‌లిసి గాథ, రోష‌న్‌లు ప్రేమలో ప‌డిన‌ట్టుగా న‌టించాల‌ని చెబుతారు. కొన్నాళ్ల‌ త‌ర్వాత ఆ ఇద్దరి మ‌ధ్య నిజంగానే ప్రేమ పుడుతుంది. అది ఎక్క‌డిదాకా దారి తీసింది? రోషన్‌, ప్రియా, గాథ‌ల ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ‌లో ఎలాంటి మ‌లుపులు చోటు చేసుకున్నాయ‌న్న‌ది తెర‌పైనే చూడాలి.

కథ విశ్లేషణ :

ఇలాంటి చిత్రాలు తెలుగు తెర‌కు కొత్తేమీ కాదు.గతంలో 'చిత్రం', 'నువ్వు నేను', 'సొంతం' ‘హ్యాపీడేస్’ లాంటి ఎన్నో సినిమాల్ని గుర్తు చేస్తుంది. ఒక‌రినొక‌రు చూసుకోవ‌డాలు, ఇష్ట‌ప‌డ‌టాలు, కాలేజీలో జ‌రిగే ఫ్రెష‌ర్స్ డే, యానువ‌ల్ డే సంద‌డితో తొలి స‌గ‌భాగం ముగుస్తుంది. ఈ కాన్సెప్టే మనకు కనబడుతుంది. లెక్చరర్లు స్టూడెంట్స్ మధ్య వచ్చే ప్రేమ, ఆకర్షణ, వంటి వాటి చుట్టే తిరిగే ఈ కథ.. ఓ వయసు వారిని మాత్రం ఆకట్టుకుంటుంది. ప్రేమకు ఆకర్షణకు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకుని తను నిజంగా ప్రేమిస్తున్న అమ్మాయికి తన ప్రేమను చెప్పే సందర్భంలో ఆ పాత్రను ముగించేశారు.

ప్లస్ పాయింట్స్:

* ప్రియా, నూరిన్ నటన

*సాంగ్స్

*క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

* కొత్త‌ద‌నం లేని క‌థ‌

*ఫస్ట్ హాఫ్