//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లవర్ ఫోన్ మాట్లాడుతుండగా సడన్‌గా గోదావరిలో దూకిన యువతి

Category : state

కొవ్వూరు రోడ్డుకమ్‌ రైలు బ్రిడ్జి నుంచి ఒక యువతి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం సాయంత్రం 5.30 సమయంలో ఒక ప్రేమజంట రోడ్డుకమ్‌ రైలు బ్రిడ్జిపైకి చేరుకుంది. రాజమహేంద్రవరం వాంబేకాలనీకి చెందిన చక్కాబిందు రాజమహేంద్రవరం దేవీచౌక్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది.

జంగారెడ్డిగూడేనికి చెందిన కంప వెంకటేష్‌లు ఇరువురూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నట్టు తెలిపారు. గురువారం సాయంత్రం ఇరువురు మోటారు సైకిళ్లపై బ్రిడ్జిపైకి చేరుకున్నారు. ఇంతలో ఏమైందోఏమో బిందు గోదావరిలోకి దూకేసిందని సమాచారం రావడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

బ్రిడ్జిపై కూర్చుని రోధిస్తున్న కంప వెంకటేష్‌(విన్ను)ను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.అయితే వెంకటేష్‌ మాట్లాడుతూ బిందు, తాను కొంతకాలంగా ప్రేమించుకుంటున్నామని బ్రిడ్జిపై తాను సెల్‌ఫోన్‌ మాట్లాడుతుండగా బ్రిడ్జిపై గోదావరిలో దూకేసిందని ఏ పక్కన దూకిందో తెలియదంటూ పొంతన లేని మాటలు చెబుతున్నాడు. వెంకటేష్‌ తండ్రి జంగారెడ్డిగూడెం లక్క వరం పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారని తెలిపారు.

సమాచారం తెలుసుకున్న బిందు తల్లి దుర్గ కొవ్వూరు పోలీసు స్టేషన్‌కు వచ్చి వెంకటేష్‌పై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. బిందు ఆత్మహత్య చేసుకుందా..లేదా అనే అనుమానంతోపాటు ఆత్మహత్యకు పాల్పడితే దానికి గల పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు నిలిపి వేయడంతో గంటల తరబడి ట్రాఫిక్‌ స్తంభించింది.