//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వరుడు ఎత్తు 5.4 , వధువు ఎత్తు 3.2 అడుగులు....ఆదర్శ ప్రేమ వివాహం

Category : state

సాధారణంగా ఈ రోజుల్లో ప్రేమించుకోవడం అంటే సర్వసాధారణం అయిపోయింది.పెళ్లి చేసుకోవడం అంటే అదేదో వన్ టైం ఎమోషన్ ప్రేమించటానికి పట్టిన సమయం కూడా కలిసి ఉండలేక పోతున్నారు.అలంటి ప్రేమలు ప్రేమికులు ఉన్న ఈ రోజుల్లో ... కేవలం ప్రేమ అంటే చూసే కళ్లకే కాదు,చూడలేని మనసుకు కూడా నచ్చాలని చాటి చెప్పింది ఓ జంట. అలా ప్రేమకు శరీరంతో పనిలేదు. మనసుంటే చాలు అని నిరూపించింది...వారిద్దరి ఎత్తులో చాలా తేడా ఉన్నప్పటికీ, వారి మనసులో మాత్రం ఎలాంటి భేదం లేదు. ఇద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ వివాహ వేడుక ముషీరాబాద్‌లోని హెరిటేజ్‌ ఫంక్షన్‌ ప్యాలెస్‌ జరిగింది. వరుడు చిదురాల విద్యాసాగర్‌ 25 ఏళ్ళ వయసు సిద్దిపేట వాసి. అతని తల్లిదండ్రులు చంద్రమౌళి, నాగమణి గతంలోనే మృతి చెందడంతో అక్క దగ్గరే ఉంటూ చదువు పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగం నిర్వర్తిస్తున్నాడు. ఇక వధువు వీరవల్లి శ్రీనివాస్, పద్మ ల కుమార్తె.. రవళి ఆమెకు 22 ఏళ్ళ వయసు వీరిది సికింద్రాబాద్‌లోని మహంకాళి ప్రాంతం.

రవళికి ఒక సోదరుడు ఉండగా అక్కాతమ్ముడు ఇద్దరూ మరుగుజ్జులే ... రవళి ప్రస్తుతం అబిడ్స్‌లోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతోంది. వరుడు ఎత్తు 5.4 అడుగులు, వధువు ఎత్తు 3.2 అడుగులు వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్టు తెలిసింది. అయితే పెళ్లితో ఇద్దరు ఒకటవ్వాలని వధూవరులు నిర్ణయించుకున్నారు. దాంతో ఇద్దరూ ఒకే కమ్యూనిటీకి చెందిన వారు కావడం, ఇల్లరికం రావాలని కోరగా వరుడు ఒప్పుకోవడంతో గురువారం రాత్రి 8 గంటలకు బంధుమిత్రుల సమక్షంలోవీరి పెళ్లి ఘనంగా జరిగింది.ఇంతటి తేడా వారి శరీరాల్లో ఉన్నప్పటికీ వారి మనసుల్లో ఎటువంటి తేడాలు లేకపోవడం ఎంతో హర్షించ దగ్గ విషయం. ఇపుడు ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Related News