//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లాంగ్‌ లాచీ అంటూ డాన్స్ చేసిన కుర్రాడు.......నెట్ లో హల్ చల్....!

Category : national movies

ఇటీవలే భారత్‌లో సంజీవ్ శ్రీవాస్తవ అనే వ్యక్తి ఓ వేడుకలో అదిరిపోయేలా స్టెప్పులు వేసి'డ్యాన్సింగ్ అంకుల్'గా పాప్యులారిటీ సంపాదించిన విషయం తెలిసిందే.

తాజాగా, పాకిస్థాన్‌లో ఓ కుర్రాడు చేసిన డ్యాన్స్‌ వైరల్‌ అవుతోంది. కరాచీలోని హైపర్‌స్టార్‌ మాల్‌లో ఆ కుర్రాడు వేసిన డ్యాన్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

మెహ్రోజ్‌ బైగ్‌ అనే విద్యార్థి.. పంజాబీ సూపర్‌ హిట్‌ ‌పాట ‘లాంగ్‌ లాచీ’ పాటకు డ్యాన్స్‌ వేశాడు. ఆయన వేసిన స్టెప్పులు వీక్షకుల్లో హుషారు తెప్పించేలా ఉన్నాయి. అక్కడ ఉన్న ఓ వృద్ధుడు కూడా ఆ కుర్రాడి డ్యాన్స్‌ని చూసి హుషారయిపోయి స్టెప్పులేశాడు.