//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సభను మార్చి 5కు వాయిదా వేసిన సుమిత్రా మహాజన్..!

Category : politics

టీడీపీ ఎంపీల నిరసనలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లియ్యాయి.దీంతో పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి.లోక్‌సభను సభాపతి సుమిత్రా మహాజన్ మార్చి 5 వరకు వాయిదా వేశారు.అలాగే రాజ్యసభ శుక్రవారం సాయంత్రం 2-30 గంటల వరకు వాయిదా పడింది.ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యాయి.

లోక్‌సభలో సభ్యులు మాట్లాడుతుండగా ఏపీ టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. విభజన హామీలు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు.సభా కార్యక్రమాలను అడ్డుకోవద్దని,సజావుగా జరిగేందుకు సహకరించాలని సభాపతి సుమిత్రా మహాజన్ ఎంత సర్దిచెప్పినప్పటికీ సభ్యులు వినకపోవడంతో సభను మార్చి 5కు వాయిదా వేశారు. అదే విధంగా రాజ్యసభలో కూడా టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు.సభా కార్యక్రమాలకు అంతరాయం కలగడంతో రాజ్యసభ ఛైన్మన్ వెంకయ్యనాయుడు సభను ఈ సాయంత్రం 2-30 గంటలకు వాయిదా వేశారు.

ఉభయసభల్లో టీడీపీ ఎంపీలు నిరసనలు కొనసాగించారు.విభజన హామీలు అమలు చేయాలంటూ లోక్‌సభలో వరుసగా ఐదోరోజు టీడీపీ ఎంపీల ఆందోళన చేపట్టారు.శుక్రవారం ఉదయం సభ మొదలైన వెంటనే టీడీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసనకు దిగారు.బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ నినాదాలు చేశారు.

స్పీకర్ సుమిత్రా మహాజన్ వారించినా ఎంపీలు తమ నిరసనను కొనసాగించారు.దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొంది.విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు.దీంతో సభాపతి సభను వాయిదా వేశారు.