//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అవిశ్వాసం నిలబడేనా? లోక్ సభలో తాజా బలాబలాలివి!

Category : national

కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నోటీసు అయితే ఇచ్చారు కాని ఈ విషయం సభలో చర్చకు వస్తుందా ? ఒక వేల వస్తే ఎన్ని పార్టీలు మద్దతిస్తాయి? ప్రభుత్వంపై ఏ మేరకు ఒత్తిడి వస్తుందన్న అంశాలపై ఈరోజు చర్చ సాగుతోంది.

ఈ అవిశ్వాసం తీర్మానం వల్ల లోక్ సభలో పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీకి ఏమీ జరగకున్నా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చెయ్యాలని వైసీపీ భావిస్తోంది. ఈ కాలక తరుణంలో ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం, ఎన్డీయే నుంచి వైదొలగి, తమంతట తాముగా నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది.

లోక్ సభలో ప్రస్తుత బలాబలాలను ఒక్కసారి పరిశీలిస్తే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 331 మంది సభ్యుల బలముంది.

బీజేపీ 273, శివసేన 18, టీడీపీ 16, ఎల్జేపీ 6, ఎస్ఏడీ 4, ఆర్ఎల్ఎస్పీ 3, ఏడీ 2, జేడీ (యూ) 2, నామినేటెడ్ సభ్యులు ఇద్దరితో పాటు, జేకే పీడీపీ, ఏఐఎన్ఆర్సీ, ఎన్పీపీ, పీఎంకే, ఎస్డీఎఫ్ పార్టీల నుంచి ఒక్కొక్కరితో పాటు అవసరమైతే స్పీకర్ మద్దతు ఆ పార్టీకుంది.

ఇక విపక్ష యూపీఏ కు 52 మంది సభ్యుల బలముండగా, అందులో కాంగ్రెస్ 48, ఐయూఎంఎల్ 2, కేసీ (ఎం) 1, ఆర్ఎస్పీ 1 ఉన్నారు. జనతా పరివార్ కూటమికి ఏడుగురు సభ్యుల బలముండగా, ఆర్జేడీ 3, ఐఎన్ఎల్డీ 2, జేడీ (ఎస్) 2 ఉన్నారు. ఏ పార్టీతోనూ పొత్తు లేని పార్టీల నుంచి 147 మంది ఎంపీలు లోక్ సభలో సభ్యులుగా ఉన్నారు. వారిలో అన్నాడీఎంకే 37, తృణమూల్ 34, బీజేడీ 20, టీఆర్ఎస్ 11, సీపీఐ (ఎం) 9, వైఎస్ఆర్ సీపీ 9 , ఎస్పీ 7, ఎన్సీపీ 6, ఆప్ 4, ఏఐయూడీఎఫ్ 3, జేఎంఎం 2తో పాటు ఏఐఎంఐఎం, సీపీఐ, జేకేఎస్సీ, ఎస్ డబ్ల్యూపీ, జేఏపీ (ఎల్)లకు తలో సభ్యుడు ఉన్నారు.

ఇతరులు ముగ్గురుండగా, ఐదు ఖాళీలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వెళ్లినా ఎన్డీయేకు 315 మంది సభ్యుల బలముంటుంది. సో ఎన్డీయే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు కాని, ఆంధ్రా కి చేసిన అన్యాయాన్ని మాత్రం జాతీయ స్థాయిలో బయట పెట్టె అవకాశం మాత్రం కలుగుతుంది.