//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీ, వైసీపీ అవిశ్వాస నోటీసులపై స్పీకర్ ప్రకటన !

Category : national

కేంద్ర ప్రభుత్వంపై తమకు నమ్మకం పోయిందంటూ టీడీపీ, వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అవిశ్వాసం నోటీసులు అందాయని లోక్‌సభ స్పీకర్ ప్రకటించారు.

అవిశ్వాస తీర్మానాలు అందాయని, కానీ వాటిపై చర్చించాలని ఉన్నప్పటికీ, సభ ఆర్డర్ లో లేదని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు. సభలో చర్చకు సానుకూల పరిస్థితి ఉన్నట్టు తనకు కనిపించడం లేదని, అందువల్లే అవిశ్వాసంపై చర్చ చేపట్టలేకపోతున్నానని అన్నారు. అన్ని పార్టీల సభ్యులూ ఇలా పోడియంలో నిరసనలు తెలుపుతూ నినాదాలు చేస్తున్న పరిస్థితుల్లో తాను మాత్రం ఏం చేయగలనని ప్రశ్నించారు.

గత్యంతరం లేని పరిస్థితుల్లోనే సోమవారానికి సభను వాయిదా వేయాల్సి ఉంటుందన్నారు. సభ సజావుగా జరిగితేనే అవిశ్వాస తీర్మానాలను పరిగణనలోకి తీసుకుంటానని హెచ్చరించిన ఆమె, సభ్యులు ఎంతకూ సర్దుకోకపోవడంతో సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. రిజర్వేషన్ల అంశంపై టీఆర్‌ఎస్ సభ్యులు, ఏపీ డిమాండ్లపై టీడీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు.