Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బెంగుళూర్ సెంట్ర‌ల్ పై ప్ర‌కాశ్ రాజ్ బ‌ల‌మెంత .....?

Category : national politics

ప‌లు బాష‌ల సినిమాల‌లో విల‌క్ష‌నంగా న‌టిస్తూ త‌న‌దైన ముద్ర వేసుకున్నారు ప్ర‌కాశ్ రాజ్ ...రాజ‌కీయాల త‌ప్పుల‌ను ఎండ‌గ‌డుతూ చాలా సార్లు వార్త‌లో నిలిచారు..తాజాగా బెంగుళూర్ సెంట్ర‌ల్ నుండి పోటి చేస్తున్నారు.ఈ మ‌ధ్య‌నే ప్ర‌జ‌ల‌కు చేరువ‌కావాల‌నే ఉద్ధేశంతో ఆస్క్ మీ అనే యాఫ్ ను ఓఫేన్ చేశారు.అయితే ఈ యాఫ్ సంగ‌తి ఎలా ఉన్న ప్ర‌కాశ్ రాజ్ కు పోటీగా నిల‌బ‌డుతున్న బీజేపీ ,కాంగ్రెస్ నేత‌ల నుండి గట్టిపోటి ఉంటుంద‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి.

ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎంపీ బీజేపీ నుండి పోటి చేసి గెలుపోందారు.ఇయ‌న 2009,2014లో జ‌రిగిన రెండు ఎన్నిక‌ల‌లో విజ‌యం సాధించ‌డంతో ,ప్ర‌కాశ్ రాజ్ కు గట్టి పోటీ ఎదుర‌వుతుంద‌నే చెప్పాలి .మ‌రో కాంగ్రెస్ నేత రాహుల్ అత్యంత స‌న్నిహితుడు కావ‌డంతో ,అత‌ను గెలిస్తే నియోజ‌క వ‌ర్గ అభివృద్ధి జ‌రుగుతుంద‌నే ఉధ్ధేశంతో ఆ నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌లు ఉన్న‌ట్లు తెలుస్తుంది .దాంతో ప్ర‌కాశ్ రాజ్ కు రెండు వైపుల నుండి గ‌ట్టి పోటీ ఎదుర‌వుతుంద‌ని అర్థ‌మ‌వుతుంది .

అయితే ప్ర‌కాశ్ రాజ్ గ‌తంలో జ‌రిగిన ప‌లు త‌ప్పుల గురించి , ప్ర‌భుత్వ పాల‌న పై త‌న దైనా శైలిలో గ‌లాన్ని విప్పారు .ఈ అంశం ప్ర‌కాశ్ రాజ్ క‌లిసోస్తుంద‌నే చెప్పాలి.అయితే ప్ర‌కాశ్ రాజ్ గ‌తంలో ప్ర‌భుత్వం పై చేసిన విమ‌ర్శ‌ల దృష్ట ఆయ‌న ఏదైనా పార్టీలో చేర‌తార‌నే ప్రచారం ఊపందుకుంది .కానీ ...వాట‌న్నిటికి ఫుల్ స్టాఫ్ పెడుతూ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బెంగుళూర్ సెంట్ర‌ల్ నుండి బ‌రిలోకి దిగారు.