//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తమిళ తాలింపులో లోకల్ లొల్లి.

Category : national politics

రాజకీయాలంటే బురదకూపం అని ఊరికే అనలేదు. అదలాంటిదని తెలిసినా జనాలకి ఏదోటి చేయాలని కొంతమంది కొత్తగా ఇందులో దూకాలని ట్రై చేస్తారు..అందులో ఇప్పుడు సూపర్ స్టార్ రజనీ కూడా ఉన్నట్లు తెలిసిందే..ఐతే ఈయన అంటూ వస్తే సిఎం కావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది..అందుకే వీలైనంత విషం చిమ్మి రాకుండా చేయాలనేది కొంతమంది ప్లాన్ గా అర్ధమవుతోంది..రజనీకాంత్ మీద విమర్శలు చేస్తున్నది కూడా తమిళ సినీ రంగానికి చెందిన వ్యక్తులే కావడం గమనార్హం. పక్కరాష్ట్రంనుంచి  వచ్చి తమిళ సినీ ఇండస్ట్రీని ఇన్నాళ్లు రారాజులా ఏలాడనే అక్కసుతో ఇలా చేస్తున్నారో? లేక మరేదైనా కారణమో? తెలియదు కానీ..... నన్ను ఇంతటి వాడిని చేసిన పరిశ్రమలోనే తనపై ఇన్నాళ్లు ఇంతటి ఈర్ష్య దాగి ఉందని తెలిసి రజనీకాంత్ కూడా కిందా మీదా ఐపోతున్నాడట.

తమిళులకు మంచి నేతలు లేరని వారంటున్నారు. మరి వారొచ్చి మమ్మల్ని ఏలాలని చూస్తున్నారు. సరే.. మా తమిళులకు మంచి నేతలే లేరనుకుందాం. మరి, మీరొచ్చి ఏం చేస్తారు..? నా భార్య గర్భవతి కాలేదని చెప్పి నా బిడ్డకు తండ్రి అవ్వడానికి నువ్వెవరు? ఏ విషయంలోనైనా భాగం అడగొచ్చు. కానీ, నా పడకలోనూ భాగం కావాలని డిమాండ్ చేస్తే ఎలా ఇస్తాను?'' అంటూ నీచమైన కామెంట్ చేశాడు డైరక్టర్ భారతీరాజా..ఒకరకంగా చెప్పాలంటే తమిళనాడులో రాజకీయాలు ఇతర రాష్ట్రాలకంటే కాస్త డిఫరెంట్.. ఇప్పుడీ కామెంట్లు చేస్తున్నవాళ్లకి జయలలిత కన్నడప్రాంతవాసి అని గుర్తులేదా..వైగో తెలుగువాడని తెలీదా..లేక కరుణానిధి మూలాలు తెలుగువాళ్లవి కాదా..ఏదో ఉబుసుపోక..గొప్పోడిమీద ఓ  రాయేస్తే తమ గురించీ కాస్త మాట్లాడుకుంటారనే దుగ్ధ తప్ప..నిజంగా టైమొస్తే ఎవరిసత్తా ఏంటో తమిళులే తేల్చుతారు కదా..