//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జ్ఞాపక శక్తీ, పాండిత్యం పెంచే మద్యం

Category : editorial

మద్యం సేవించడం కారణంగా పలు రుగ్మతలు, అనారోగ్యాలు కలిగే అవకాశం ఉన్నదని మనం ఆందోళన చెందుతూ ఉంటాము. అయితే మద్యం సేవించడం వల్లన జ్ఞాపక శక్తీ, పాండిత్యం(విషయం పరిజ్ఞానం) పెరుగుతుందని తాజా అధ్యయనం ఒకటి చెబుతున్నది.

బ్రిటన్ లో ఎక్సెటర్ యూనివర్సిటీ కి చెందిన పరిశోధకులు సాంఘికంగా మద్యం సేవించే 88 మందికి ఒక విషయం పరిజ్ఞానం టాస్క్ ఇచ్చారు. వారిని రెండు బృందాలుగా విభజించి వారిని ఇష్టం వచ్చినంత మద్యం సేవించమని చెప్పారు. (సగటున నాలుగు పెగ్ లు). లేదా అసలు త్రాగ వద్దన్నారు. మరుసటి రోజున కూడా అదే విధంగా చేయమన్నారు.

ఎక్కువగా త్రాగిన వారు తాము ఏమి నేర్చుకున్నామో బాగా గుర్తుంచుకున్నట్లు గమనించారు. "తాగినవారు ఇచ్చిన టాస్క్ ను బాగా చేయడమే కాకుండా, ఎక్కువగా త్రాగిన వారు మరింత బాగా చేసారు" అని ప్రొఫెసర్ సెలీనా మోర్గాన్ చెప్పారు. అయితే అందుకు కారణం ఏమిటో పూర్తిగా  తెలుసుకోలేక పోయామని ఆమె తెలిపారు.

"అయితే ఈ సందర్భంగా అర్ధం అవుతున్నది మెదడులో నూతనంగా నేర్చుకొనే బ్లాక్ లను మద్యం మూసివేయడంతో మెదడులో అంతకు ముందు నేర్చుకున్నదీర్ఘకాలపు జ్ఞాపకాలుగా మిగులుతాయి" అని ఆమె వివరించారు. ఈ ప్రక్రియ కారణంగా స్వల్పకాలం గుర్తుండే అంశాలు దీర్ఘకాలం గుర్తుండేటట్లు అవుతుంది.

Related News