//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఐపీయల్ లో మరో ఆసక్తికర మ్యాచ్ కు అంతా సిద్ధం..!

Category : sports

ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నీలో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య ఈ రోజు మ్యాచ్‌ జరగనుంది. ఈ టోర్నీలో ఈ రెండు జట్లకు ఇదే చివరి లీగ్‌ మ్యాచ్‌. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవాలని హైదరాబాద్‌.. ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్‌ బెర్తును సొంతం చేసుకోవాలని కోల్‌కతా ఆరాటపడుతున్నాయి.

ఈ మ్యాచ్‌లో కోల్‌కతా గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా ప్లేఆఫ్‌ బెర్తు ఖరారు చేసుకుంటుంది. ఒకవేళ ఓడితే మాత్రం... ముంబయి, బెంగళూరు, రాజస్థాన్‌, పంజాబ్‌ల చివరి మ్యాచ్‌ల ఫలితాల వరకు వేచి చూడాలి. ఈ సందర్భంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కోచ్‌ కలిస్‌ మాట్లాడుతూ...‘ఇది మేము తప్పక గెలవాల్సిన మ్యాచ్‌.

ఈ మ్యాచ్‌లో మా ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శనతో రాణిస్తారు. ప్లేఆఫ్‌కు దూసుకెళ్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సన్‌రైజర్స్‌ కూడా చాలా మంచి క్రికెట్‌ ఆడుతోంది. అందుకే ఆ జట్టు ఎప్పుడో ప్లేఆఫ్‌ బెర్తును ఖరారు చేసుకుని టాప్‌లో నిలిచింది.

వారు మాతో జరిగే మ్యాచ్‌లో ఓడిపోవాలని అనుకోరు. కానీ, మేము చాలా మంచి క్రికెట్‌ ఆడి వారిని ఓడిస్తాం’ అని కలిస్‌ ధీమా వ్యక్తం చేశాడు.ఇంతటి ఆసక్తికరమైన మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. సన్‌రైజర్స్‌ గెలిచి అగ్రస్థానంలో నిలుస్తుందా... లేదంటే కోల్‌కతా గెలిచి ప్లేఆఫ్‌ బెర్తును ఖరారు చేసుకుంటుందో చూద్దాం!