//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రేజ్యుం ఇస్తున్నారా..? అయితే ఇక జాగ్రత్త

Category : business

ఏదైనా కంపెనీలో ఉద్యోగానికి వెళ్తే చాలు రేజ్యుం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. మేము అక్కడ పని చేసాం ఇక్కడ చేసాం... మాకు ఇది వచ్చు అది వచ్చు అంటూ ఉద్యోగం తెచ్చుకోవడానికి నానా పాట్లు పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వారి మాటలు కంపెనీలు నమ్మి ఉద్యోగాలు ఇచ్చి మోసపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీనితో ఇప్పుడు అలాంటి వారి ఆట కట్టించే పరికరం ఒకటి అందుబాటులోకి వచ్చేసింది.

ఇక నుంచి. ఏదైనా కంపెనీకి రెజ్యూమ్ ఇస్తే.. లై డిటెక్టర్ టెస్ట్‌కు రెడీగా ఉండాల్సిందే.ఈ విధానాన్ని హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రముఖ కంపెనీలు ఇప్పటికే ప్రారంభించేశాయట. అభ్యర్థులు తమకు ఇచ్చే రెజ్యూమ్‌లలో చెప్పిన విషయాలు నిజమేనా కాదా అని తెలుసుకోవడానికి గాను ఈ టెస్టులు నిర్వహిస్తున్నాయట కంపెనీలు.అయితే యూరోపియన్ దేశాలలో ఈ టెస్టులు సర్వసాధారణమంటున్నారు నిపుణులు.

అభ్యర్థుల బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోవడానికి కంపెనీలు పాలీగ్రాఫ్ టెస్టులు నిర్వహిస్తాయని... చెమట పట్టడం, హృదయస్పందన, నాడి కొట్టుకోవడం, రక్తప్రసరణ వంటి వాటిని బట్టి నివేదిక రూపొందిస్తారు.ఈ పరీక్షలో మూడు రకాల ప్రశ్నలు ఉంటాయని.. వాటికి అవును/కాదు అనే సమాధానాలు మాత్రమే ఉంటాయన్నారు. పాలీగ్రాఫ్‌ పట్టిక ఆధారంగా రిపోర్ట్ అందిస్తామన్నారు నిపుణులు. ఆ నివేదికను బట్టి కంపెనీలు అభ్యర్థులపై తమ నిర్ణయం తీసుకోనున్నాయి.