Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ముంబై-ఢిల్లీ విమానంలో లేఖ కలకలం

Posted 3 months ago | Category : national

విమానంలో హైజాకర్లు ఉన్నారని, బాంబు కూడా ఉందనే ఓ బెదిరింపు లేఖ జెట్ ఎయిర్‌వేస్ విమానంలో తీవ్ర గందరగోళం సృష్టించింది. ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానం టాయ్‌లెట్‌లో లేఖ దొరుకడంతో అహ్మదాబాద్‌లో అత్యవసరంగా దింపేశారు. 9 డబ్ల్యూ339 నంబర్ గల విమానం ముంబై నుంచి 115 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో సోమవారం తెల్లవారుజామున 2.55గంటలకు బయలుదేరగా.. 3.45 గంటలకు అత్యవసరంగా అహ్మదాబాద్‌లో దిగింది. ప్రయాణికుల సామగ్రిని తనిఖీ చేయగా పేలుడు పదార్థాలేవీ లభించలేదని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) అధికారి చెప్పారు.

విమానంలో హైజాకర్లు, పేలుడు పదార్థాలు ఉన్నాయని పైలట్ చెప్పడంతో ఆహ్మదాబాద్‌లో అత్యవసరంగా విమానాన్ని దిం పేందుకు అనుమతి ఇచ్చాం.. పోలీసులు, బాంబు స్కాడ్ తనిఖీలు నిర్వహించి అలాంటివేవీ లేవని తేల్చడంతో ఉదయం 10.30 గంటలకు విమానాన్ని గమ్యస్థానానికి పంపించాం అని అహ్మదాబాద్ విమానాశ్రయం డైరెక్టర్ మనోజ్ గంగల్ తెలిపారు. ఇంత గందరగోళానికి ఒక లేఖ కారణమయ్యింది. ఉర్దూ, ఇంగ్లిష్‌లో ప్రింట్ చేసి ఉన్న ఆ లేఖలో..విమానంలో 12మంది హైజాకర్లు ఉన్నా రు. సరుకుల విభాగంలో బాంబు ఉన్నది. విమానాన్ని నేరుగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)కు మళ్లించాలి. ఒకవేళ ఢిల్లీలో దింపాలని ప్రయత్నిస్తే..

ప్రయాణికుల మృత్యుకేకలు వినిపిస్తాయి.. అల్లా చాలా గొప్పవాడు అని రాసి ఉంది. విమానంలోని 1ఏ సీటులో ప్రయాణిస్తున్న బిర్జు కిశోర్ సల్ల అనే బంగారు నగల వ్యాపారి టాయ్‌లెట్‌లో బెదిరింపు లేఖ ఉన్నట్టుగా పైలట్‌కు తెలిపాడు. దీంతో పైలట్ హైజాక్ హెచ్చరికలను జారీచేసే బటన్‌ను నొక్కారు.ప్రాథమిక విచారణలో బిర్జు కిశోరే ఆ లేఖను టాయ్‌లెట్‌లో పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. విచారణ సందర్భంగా సల్ల కిశోర్ ఓ ప్రేమ కథను కూడా వినిపించాడు. జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ మహిళా ఉద్యోగితో ప్రేమలో పడ్డానని చెప్పాడు. జెట్‌ఎయిర్‌వేస్‌పై పుకార్లు పుట్టించి సంస్థను మూతపడేలా చేయడం ద్వారా ఆమె నిరుద్యోగిగా మారి..

తన వద్దకు ఉద్యోగం కోసం వస్తుందని భావించానని పేర్కొన్నాడు. ఇందులో భాగంగానే గత జూలై నెలలో జెట్‌ఎయిర్‌వేస్ అందించిన భోజనంలో బొద్దింక ఉందని చెప్పి సిబ్బందితో తీవ్రంగా గొడవపడ్డానని చెప్పాడు అని సీనియర్ విచారణ అధికారి తెలిపారు. బిర్జు కిశోర్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతడిపై కఠినమైన అభియోగాలు మోపాలని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోకగజపతిరాజు ట్విట్టర్‌లో స్పందిస్తూ..

బిర్జు కిశోర్ అనే వ్యక్తిని ఈ సంఘటనకు బాధ్యుడిగా గుర్తించి, అరెస్టు చేశాం. అతడు ప్రయాణికులను, సిబ్బందిని చాలా ఇబ్బంది పెట్టాడు. విమానాల్లో ప్రయాణించకుండా నిషేధిత జాబితాలో అతడి పేరును చేర్చాలని ఎయిర్‌లైన్స్‌కు సూచించాను అని పేర్కొన్నారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted 2 hours ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే