//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాశ్మీర్ లో టాప్ టెర్రరిస్ట్ బాషిర్ లష్కరి ను లేపేశారు.

Category : national

ఇటీవలి కాలంలో ఉద్రిక్తంగా మారిన జమ్ముకాశ్మీర్ లో పరిస్థితిని చక్కదిద్దే పనిని ఆర్మీ చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ లోని ఒక భవనంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న విశ్వసనీయ సమాచారంతో సాయుధ బలగాలు ఆ భవంతిని చుట్టుముట్టాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు- సాయుధ బలగాల మధ్య కాల్పుల యుద్ధం మొదలైంది. ఇరు పక్షాల మధ్యా హోరాహోరీగా సాగుతున్న కాల్పుల యుద్ధంలో ఒక యువతి మరణించింది. లష్కరే తోయిబా టాప్ కమాండర్ బాషిర్ లష్కరి హతమయ్యాడు.

ఉగ్రవాది బాషిర్ లష్కరిపై గతంలో కశ్మీర్ పోలీసులు 10 లక్షల నజరానా ప్రకటించారు. జూన్ 17న జరిగిన దాడిలో ఏడురుగు పోలీసులు చనిపోవడం వల్ల బాషిర్ ను పట్టిస్తే నజరానా ఇస్తామని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. సోప్సాలి కోకర్నాగ్కు చెందిన బాషిర్ లష్కరి 2015 అక్టోబర్ 2న మిలిటెంట్ సంస్థలో చేరాడు. ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు సాధారణ పౌరులు చనిపోయారు. ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. మిలిటెంట్ల కోసం గాలింపు జరుపుతున్న సమయంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ కాల్పుల్లో 17 మంది సాధారణ పౌరులు కూడా గాయపడ్డారు.