//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాకిని చూసి నేర్చుకోండి..

Category : state

ఈ రోజుల్లో మనుషులు అన్ని పనులను యంత్రాలకు అప్పగించి తాను సేదతీరుతున్నాడు. ఏదైనా ఓక పని చేయాలంటే ఈ రోజుల్లో మనం యంత్రాలను వాడుతున్నాం. కానీ ఫ్రాన్స్‌కు చెందిన ఒక వ్యక్తి చేస్తున్న పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇతను ఒక పార్కును పరిశుభ్రపరిచేందుకు యంత్రాలు, లేదా మనుషులను వినియోగించేందుకు బదులు కాకులను వినియోగిస్తున్నాడు. ఫ్రాన్స్‌లోని ఆరు కాకులు ఒక థీమ్ పార్క్‌ను పరిశుభ్రపరిచేందుకు డ్యూటీలు నిర్వహిస్తున్నాయి. ఇవి పార్కులో పడిన సిగరెట్ పీకలు, చెత్తాచెదారాన్ని ఏరివేసి, డస్ట్‌బిన్‌లో పడేస్తుంటాయి.

ఈ పనులను చేసినందుకు ప్రతిగా పార్కు నిర్వాహకులు ఈ కాకులకు మంచి ఆహారం అందిస్తుంటారు. పార్కు నిర్వాహకులు నికోలస్ డే విలియర్స్ మాట్లాడుతూ తన ఉద్దేశం కేవలం పరిశుభ్రతే కాదని, ప్రకృతే స్వయంగా మనకు పరిశుభ్రత నేర్పుతున్నదని తెలియజేయాలనుకుంటున్నానన్నారు. కాకుల మనుషులతో ఎప్పటి నుంచో సన్నిహితంగా మెలగుతున్నాయన్నారు.

Related News