Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నిర్లక్ష్యం ప్రదర్శించే న్యాయవాదులకు కూడా జరిమానాలే

Posted 5 months ago | Category : national

వాయిదాలకు సరిగ్గా హాజరు కాకుండా, ప్రత్యర్థి ప్రలోభాలకు లొంగి మోసం చేసినా, నష్టం కలిగించే న్యాయ సలహాలు ఇచ్చినా, న్యాయవాది నిర్లక్ష్యం కారణంగా కోర్ట్ లో ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చినా ఇక మనం న్యాయవాదుల పైననే కేసు వేయవచ్చు. వృత్తి నిబద్ధతను పాటించని న్యాయవాదులకు జడ్జిలు సహితం భారీ జరిమానా విధించే వీలు ఏర్పడనున్నది.

న్యాయవాద వృత్తిలో అనైతికంగా వ్యవహరిస్తున్న న్యాయవాదుల ఆగడాల నుండి కక్షిదారులకు రక్షణ కాపాడటం కోసం కేంద్ర ప్రభుత్వం అడ్వకేట్స్ చట్ట సవరణ బిల్లును తీసుకురాబోతోంది. ఏదైనా కేసులో విచారణకు హాజరుకాకపోయినా, గైర్హాజరైనా, పిటీషనర్ అభిమతానికి వ్యతిరేకంగా వ్యవహరించినా న్యాయవాదులపై జరిమానా తప్పదు.

 లా కమిషన్ ఇచ్చిన 266వ రిపోర్టు ప్రకారం అడ్వకేట్స్ చట్టం 1961కి సవరణలు తెస్తూ కేంద్రప్రభుత్వం 2017 న్యాయవాదుల చట్టసవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతోంది. దీనితో తమ ఆగడాలకు చెక్ పడుతుందని, న్యాయశాస్త్రంలో తమ ప్రతిభను చూపడం ద్వారా కాకుండా, కక్షిదారులను మోసం చేయడం ద్వారా భారీ ఆదాయాలు పొందటం సాధ్యం కాదని ఈ సవరణల పట్ల న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఈ బిల్లు న్యాయవాదుల హక్కులను కాలరాసే విధంగా ఉండటమేగాక, బార్ కౌన్సిల్ ఉనికిని, అస్తిత్వాన్ని , దాని స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా ఉందని న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సవరణ బిల్లు న్యాయవాద వృత్తి ఔన్నత్యాన్ని కించపరచడమేగాక, బార్ కౌన్సిల్ నిర్వహణలో అనవసర జోక్యాన్ని తావిచ్చేదిగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ సవరణ ద్వారా న్యాయవాది అనే పదాన్ని నిర్వచిస్తూ విదేశీ న్యాయవాదులను సైతం స్వేచ్ఛగా దేశంలో ప్రవేశించే వీలు కల్పించడంతో న్యాయవాద కార్పొరేట్ సంస్థలు దేశంలోకి వచ్చే ప్రమాదం ఏర్పడుతున్నది. న్యాయవాదుల దుష్ప్రవర్తన అనే విషయాలను ఆపాదించిన వ్యక్తి స్వేచ్ఛను, వృత్తి పరమైన వెసులుబాటు హరించే ప్రయత్నం జరుగుతోందని భావిస్తున్నారు.

బార్‌కౌన్సిల్ అస్థితాన్ని దెబ్బతీసే విధంగా న్యాయవాద వృత్తితో సంబంధం లేని వ్యక్తులను మండళ్లలో, వాటి వ్యవహారాల్లో తలదూర్చే అవకాశం కల్పించడమే గాక, న్యాయవాదుల సంక్షేమానికి ఇది ప్రతిబంధకం కాగలదని నిరసన  వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణా కమిటీలో వృత్తితో సంబంధం లేని వ్యక్తులను చేర్చే ప్రయత్నం, తద్వారా న్యాయవాద వృత్తిని ప్రశ్నార్ధకం లోకి మార్చే అవకాశం ఏర్పడిందని విమర్శిస్తున్నారు.

సెక్షన్ 24ఎ సవరణ ద్వారా ఏ వ్యక్తి అయినా ఆరోపణలో ప్రభుత్వ ఉద్యోగం నుండి తొలగించబడితే అతను న్యాయవాద వృత్తికి అనర్హుడిగా చేసే ప్రయత్నం జరుగుతోంది. కాని తమ హక్కుల కోసం పోరాడే క్రమంలో యాజమాన్యం కక్షపూరిత ధోరణితో విధించే శిక్షలకు అనర్హులను చేయడం సమ్మతం కాదని న్యాయవాదులు పేర్కొంటున్నారు.

అలాగే సెక్షన్ 35ఎ ప్రకారం వ్యక్తి వృత్తిస్వేచ్ఛను అపహరించే ప్రయత్నం జరుగుతోంది. సెక్షన్ 45ఎ ప్రకారం వృత్తి పరమైన తప్పిదాలకు వృత్తిగతమైనవిగా భావించి తమకు న్యాయం జరగలేదని భావించినపుడు ఆ న్యాయవాది నుండి పరిహారం కోరే హక్కును కక్షిదారులకు కల్పించడం జరిగింది. పరిహారం 3 నుండి 5 లక్షల రూపాయల వరకూ వీలుకల్పిస్తున్నారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted 3 hours ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే