//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లేటెస్ట్ సర్వే .....మళ్ళీ అమరావతికి రారాజు చంద్రబాబే...!

Category : politics

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రణరంగం లా మారింది . వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికలు అన్ని పార్టీలకి చాలా కీలకం కానున్నాయి . ఈ ఎన్నికలకి అన్ని పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అని తెలుస్తుంది . రాష్ట్రము విడిపోయిన తరువాత జరిగిన మొదటి ఎన్నికల్లో టీడీపీ జయభేరి మోగించి నవ్యంధ్ర ప్రదేశ్ లో మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది . ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఉరకలు పెట్టించాడు .

ఇక పొతే పోయిన ఎన్నికలో టీడీపీ బీజేపీ , మరియు పవర్ స్టార్ పార్టీ అయిన జనసేన తో కలిసి కదన రంగం లోకి దూకింది . చంద్రబాబు మైలేజ్ కి తోడు ఇంకొంచెం ఎక్సట్రాగా పవన్ కూడా తోడు కావటం తో ఆ ఎన్నికల్లో టీడీపీ కి తిరుగులేకుండా పోయింది .ఇక పొతే ప్రస్తుత పరిస్థితులని ఒకసారి గమనిస్తే ఏపీ లో అధికారం మళ్ళీ టీడీపీ దే అని తెలుస్తుంది .

రాష్ట్రం లో ఉన్న పరిస్థితులని అంచనా వేయడానికి సీఎం చంద్రబాబు ఒక రహస్య సర్వే నిర్వహించినట్టు సమాచారం . ఈ సర్వే లో వెల్లడైన విషయాలని చూస్తే ఎవరైనా కూడా విస్తూ పోవాల్సిందే . జగన్ ఈసారి ఎన్నికల్లో అధికారం మనదే అంటూ ప్రజాసంకల్ప యాత్ర లో బిజీ గా ఉన్నాడు కానీ రాష్ట్రం లో ఉండే పరిస్థితులు వేరేలా ఉన్నాయి .

ఇప్పుడున్న సమయం లో జగన్ ని ఎవ్వరు విశ్వసించేలా లేరు . చంద్రబాబు చేసిన అభివృద్ధికి మళ్ళీ చంద్రబాబే రావాలని ఆంధ్రా ప్రజలు ధృడ సంకల్పం తో ఉన్నట్టు తెలుస్తుంది . చంద్రబాబు రహస్య సర్వేలో టీడీపీ కి వచ్చే ఎన్నికల్లో 65 శాతానికి పైగా ఓట్లు వస్తాయని తెలుస్తుంది .లేటెస్ట్ గా వచ్చిన ఈ సర్వే గురించి తెలుసుకుంటే అమరావతికి రారాజు మళ్ళీ బాబే అనిపించక మానదు . వచ్చే ఎన్నికల్లో టీడీపీ కి దాదాపుగా 135 నుండి 140 సీట్లురావచ్చు అని తెలుస్తుంది .

Related News