బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ మహిళల సింగిల్స్‌లో పీ వీ సింధు రజత పతకం సాధించింది. ఈ ఛాంపియన్షిప్స్ విజేత కరొలినా మారిన్. మొదటి గేమ్‌లో సింధు పోరాట పటిమతో చాలా శ్రమించిన మారిన్ రెండో గేమ్‌లో తన ఆధిపత్యాన్ని నిరంతరం కొనసాగించింది.
ఏ దశలోనూ సింధు ఆమెకు చేరువ కాలేకపోయింది. కరోలినా మారిన్ 21-19, 21-10 తేడాతో వరుస గేమ్స్‌లో విజయం సాధించి, స్వర్ణ పతకం సొంతం చేసుకుని, ఛాంపియన్‌గా నిలిచింది.
చైనాలోని నన్జింగ్ ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్లో ఈ ఫైనల్ మ్యాచ్ జరిగింది. వరల్డ్ మూడో ర్యాంకర్ పూసర్ల వెంకట సింధు మరోసారి నిరాశపరిచింది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రజత పతకంతోనే సరిపెట్టుకుంది.