//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆలస్యంగానైనా కళ్లు తెరిచిన రైల్వే శాఖ.....!

Category : national state

రైళ్లలో టికెట్ల రిజర్వేషన్ పూర్తవుతున్న కొద్దీ అమలవుతుంటే ఫ్లెక్సీ ఫేర్ విధానానికి స్వస్తి చెబుతున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. డైనమిక్ ప్రైసింగ్ పేరిట ప్రస్తుతం 142 రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్ పాలసీ అమలవుతుండగా, చార్జీల భారం మోయలేకపోతున్నామని గగ్గోలు పెడుతున్న ప్రయాణికులకు శుభవార్త చెబుతూ, తొలి దశలో 40 రైళ్లలో డైనమిక్ ప్రైసింగ్ కు గుడ్ బై చెబుతున్నామని, మరో 102 రైళ్లలో 60 శాతం వరకూ డిస్కౌంట్ ను దగ్గర చేస్తున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ విధానం అమలుపై విమర్శలు వస్తున్న వేళ, రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

40 రైళ్లలో డైనమిక్ ప్రైసింగ్ ను ఎత్తేస్తున్నామని వెల్లడించిన అధికారులు, మిగతా రైళ్లలో ప్రయాణానికి నాలుగు రోజుల ముందు నుంచి చివరి క్షణం వరకూ బుక్ చేసుకునే టికెట్లపై 50 శాతం డిస్కౌంట్ ను, 60 శాతం కన్నా తక్కువగా సీట్ల రిజర్వేషన్ ఉన్న రైళ్లలో గ్రేడెడ్ డిస్కౌంట్ ను అందిస్తామని తెలిపారు.

ప్రస్తుతం 44 రాజధాని రైళ్లు, 46 శతాబ్ది రైళ్లు, 52 దురంతో రైళ్లలో ఈ విధానం అమలవుతుంది. రైలు టికెట్ ధరలు భారీగా ఉండటంతో, తగ్గింపు రేట్లకు లభిస్తున్న విమానాలను ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆదాయ కొరత ఏర్పడగా, రైల్వే శాఖ ఆలస్యంగానైనా కళ్లు తెరిచిందని ప్రయాణికులు వ్యాఖ్యానిస్తున్నారు.

#Railwaydepartment #latestnews #telugunews

Related News