//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చివరి నిమిషంలో అధిష్టానం.. అవాక్కయ్యే నిర్ణయం..!

Category : politics

ఆంధ్రప్రదేశ్ టీడీపీ పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఖరారైంది. ఎ నిమిషానికి ఏమి జరుగునో అన్న సిద్దాంతం ఇక్కడ రుజువయ్యింది. రాజ్యసభ రెండు స్థానాల అభ్యర్థుల ఎంపిక విషయంలో ఊహించని మలుపు తిరిగింది.

వర్ల రామయ్యకు రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం వరిస్తుందని అనుకున్న చివరి నిమిషంలో కనకమేడల రవీంద్ర కుమార్ పేరును ఖరారు చేస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. కాగా, రాజ్యసభకు ఎంపికైన వారిలో సీఎం రమేశ్ తో పాటు వర్ల రామయ్య పేరు కూడా మొదట్లో వినపడింది.

పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్రకుమార్ అవకాశం లభించడం గమనార్హం. ముప్పై ఏళ్ళ నుంచి పార్టీకి సేవ చేస్తున్న కనకమేడల రవీంద్ర కుమార్ కు ఎటువంటి అధికారం ఇవ్వలేదని, ఈ నేపథ్యంలో ఆయనకు ఎంపీగా అవకాశం కల్పిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రెండవ స్థానాన్ని సీఎం రమేష్ కు దక్కింది.

Related News