//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నామినేషన్లకు ఆఖరు తేదీ నేడే .. 3గంటల వరకే నామినేషన్ల స్వీకరణ

Category : state politics

దేశ వ్యాప్తంగా తొలి దశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారంతో ముగియనుంది. తొలి దశ ఎన్నికలకు మార్చి 18న నోటిఫికేషన్ జారీ కాగా, అదే రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీలో లోక్‌సభతోపాటు శాసనసభ, తెలంగాణలో పార్లమెంటు స్థానాలకు తొలి దశలోనే ఎన్నికలు జరుగుతోన్న విషయం తెలిసిందే. మార్చి 26 నుంచి 27 వరకు నామినేషన్ల పరిశీలన, మార్చి 28 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. తెలంగాణ, ఏపీలో ఇప్పటికే కీలక నేతలందరూ నామినేషన్లు దాఖలు చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు తరపున కుప్పంలో టీడీపీ నేతలు, పులివెందులలో జగన్మోహన్‌రెడ్డి, గాజువాక, భీమవరంలో పవన్‌కల్యాణ్‌, మంగళగిరిలో నారా లోకేశ్ సహ పలువురు ప్రముఖులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకూ దాదాపు వెయ్యికి పైగా నామినేషన్లు దాఖలైనట్టు సమాచారం. తొలి దశలో ఏపీ, తెలంగాణల్లో 42 స్థానాలతో సహా 91 చోట్ల ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. తొలి దశ ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఏపీ శాసనసభకు ఎన్నికలు జరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి 75 మంది ఎన్నికల పరిశీలకులను, 13మంది పోలీస్ పరిశీలకులు నియమించినట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు.

మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటి వరకు 220 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్ల ఘట్టాన్ని దాదాపుగా పూర్తిచేశారు. నిజామాబాద్‌లో పసుపు, ఎర్రజొన్న రైతులు, ఖమ్మంలో మిర్చి రైతులు గిట్టుబాటు ధర కోసం నామినేషన్ల ద్వారా నిరసన వ్యక్తం చేశారు. మొత్తానికి నేడు సాయంత్రం 3 గంటల వరకే నామినేషన్లు వేసే అవకాశం ఉన్నందున నేడు భారీగా నామినేషన్లు వేసే అవకాశం వుంది.