బ్రిటన్ కు చెందిన ఫెర్గూస్ విల్సన్ అనే ధనవంతుడు తన ఇళ్లను భారతీయులకు, పాకిస్థానీయులకు అద్దెకు ఇవ్వనని నిర్ణయించుకున్నాడు. ‘వారు ఇళ్లు ఖాళీ చేశాక భారతీయ వంటకాల వాసన వస్తుంది. మళ్లీ కార్పెట్లు వేయడానికి ఖర్చవుతుంది...అందుకే వారికీ ఇల్లు ఇవ్వను అని అంటున్నాడు. దీనిపై విమర్శలు, నాయపరమైన సమస్యలు ఎదురైనా తన నిర్ణయంలో మార్పు ఉండదంటున్నాడు. జాతీయులకు ఇళ్లను కిరాయి ఇవ్వొద్దంటూ ఫెర్గూస్ తన ఏజెంట్లకు పంపిన ఈమెయిల్స్ లీక్ కావడంతో వివాదం రేగింది.
దీనిపై బ్రిటన్ మానవ హక్కుల సంస్థ ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్(ఈహెచ్ఆర్సీ) కోర్టులో సవాలు చేసింది. విల్సన్ నిర్ణయాన్ని నిలిపేస్తూ ఆదేశాలివ్వాలని సెంట్రల్ లండన్ కౌంటీ కోర్టును కోరామని సంస్థ ప్రతినిధి రెబెక్కా హిల్సెన్రథ్ తెలిపారు. ఇతనికి వెయ్యికిపైగా ఇల్లు ఉన్నాయి.