Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దాణా స్కాం లో లాలూకు ఎన్నేళ్ళు శిక్ష పడిందో తెలుసా ?

Posted 17 days ago | Category : national

దాణా కుంభకోణం కేసులో సీబీఐ కోర్టు ఈరోజు తుది తీర్పు వెల్లడించింది.

దాదాపు రెండు దశాబ్దాల కిందట వెలుగులోకి వచ్చిన దాణా కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రూ.900 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన ఈ కేసు కారణంగా లాలూ.. సీఎం పదవి నుంచి వైదొలిగి తన భార్య రబ్రీ దేవిని ఆ పదవిలో కూర్చోబెట్టాల్సి వచ్చింది.

దియోగర్‌ ట్రెజరీ నుంచి రూ.89.27 లక్షలు అక్రమంగా డ్రా చేసిన కేసులో లాలూతో పాటు మరో 15 మందిని దోషులుగా ప్రకటిస్తూ.. న్యాయస్థానం గత డిసెంబర్ 23న తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు మూడున్నరేళ్ల జైలు శిక్ష విధిస్తూ.. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో పాటు రూ. 5 లక్షల జరిమానా కూడా విధించింది.

దాణా కుంభకోణానికి సంబంధించి లాలూపై మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకటైన చైబాసా కోశాగార కేసులో ఇప్పటికే లాలూ దోషిగా తేలారు. ఈ కేసులో ఆయణ్ని దోషిగా తేలుస్తూ 2013లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. లాలూ ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ ఆరేళ్ల పాటు నిషేధం విధించింది. 75 రోజుల పాటు జైల్లో ఉన్న లాలూ.. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు.

తాజాగా వెలువడిన తీర్పు దేవగఢ్‌ కోశాగార కేసుకు సంబంధించింది. 1991 నుంచి 1994 మధ్య పశుదాణా పేరుతో ఖజానా నుంచి రూ.89 లక్షలు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసులో 38 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. విచారణ సమయంలో వీరిలో 11 మంది మృతిచెందగా, మరో ముగ్గురు అప్రూవర్‌గా మారారు. ఇంకో ఇద్దరు నేరాన్ని అంగీకరించడంతో 2006లో వారికి శిక్ష విధించారు.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 21 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 9 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !