Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వర్మ 'ఎందుకు' పాటకు లక్ష్మిపార్వతి ఫైర్

Category : movies

ఇప్పటికే మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ విడుదలైన విషయం తెల్సిందే. అయితే రామ్ గోపాల్ వర్మ వాటికీ రివర్స్ గా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అస్సలు కథ అని సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మొదటి పాట, వెన్నుపోటు పాటను విడుదల చేసిన వర్మ, నిన్న సాయంత్రం 'ఎందుకు' అంటూ రెండొవ పాటను విడుదల చేసాడు వర్మ. ఆ పాట గురించి ఎన్టీఆర్ భార్య లక్ష్మి పార్వతి స్పందించారు.

'ఎందుకు?' పాట గురించి లక్ష్మి పార్వతి ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఆ పాట తనకు బాధ కలిగించిందని లక్ష్మీపార్వతి తెలిపారు. రామ్ గోపాల్ వర్మ ఈ పాటలో తనను విమర్శించినట్లు అనిపించిందని అన్నారు. అయితే పాట చివరిలో మాత్రం ఇవన్నీ ప్రశ్నలేనని వర్మ చెప్పారు. అప్పట్లో టీడీపీ నేతలు లక్ష్మి పార్వతి కులం తనది కాదని, తన ఊరు సొంతూరు కాదని తప్పుడు ప్రచారం చేశారు లక్ష్మి పార్వతి చెప్పారు. బయోపిక్ అంటే ఆనందంగా ఉన్నపుడే తీసేది కాదనీ, ఆయన పడిన కష్టాలు, బాధలను చూపించాలని స్పష్టం చేశారు. సినిమాల్లోకి రాకముందు సైతం ఎన్టీఆర్ కష్టాలు పడ్డారని వ్యాఖ్యానించారు.