//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేసీఆర్ గెలుపుపై మాట దాటేసిన లగడపాటి... రీజన్ ఇదే

Category : politics state

సర్వేల స్పెషలిస్ట్ నని చెప్పుకునే లగడపాటి తెలంగాణా ఎన్నికలపై ఆసక్తికర పలితాలు వెల్లడించారు. అన్ని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారని గులాబీ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందని చెప్తే లగడపాటి ఒక్కరే ఊరంతా ఒక దారైతే ఉలిపికట్టెది ఒక దారి అన్న చందంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక సర్వే ఫలితాలను చెప్పిన లగడపాటి అన్ని పది అటు ఇటు అని అర్ధం కాకుండా చెప్పి మొత్తానికి కూటమి హవా కొనసాగుతుందని చెప్పుకొచ్చారు.

తన సర్వేపై సుదీర్ఘ వివరణ ఇచ్చిన లగడపాటి ఇక గజ్వెల్ నియోజకవర్గంలో ప్రజా కూటమి అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గెలుస్తారా, లేదా అనే విషయాన్ని వెల్లడించడానికి మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నిరాకరించారు. ఆ విషయం మాట్లాడితే బాగుండదని ఆయన అన్నారు. ఆ మాటతో లగడపాటి ద్వంద్వ అర్ధాలు స్పురించేలా మాట్లాడారు. ఇప్పుడు ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. మీడియాకు ఆయన తన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెల్లడించిన సమయం సందర్భంగా గజ్వెల్ పై మీడియా ప్రతినిధులు పదే పదే అడిగినా కూడా ఆయన జవాబు చెప్పడానికి ఇష్టపడలేదు. గజ్వేల్‌లో 88 శాతం పోలింగ్‌ అయిందని, అక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందని విలేకరులు ప్రశ్నించగా, అలా వ్యక్తిగతంగా వివరాలు చెప్పబోనని లగడపాటి స్పష్టం చేశారు. గజ్వేల్‌ ఫలితాన్ని మీ ఊహకు వదిలేస్తున్నానని అన్నారు.

కేసీఆర్‌ ఓడిపోతారా? అని అడిగితే తానెప్పుడు ఆ మాట ఆనలేదని జవాబిచ్చారు. గజ్వేల్‌ కానిస్టేబుల్‌ చెప్పింది నిజమవుతుందా అన్న ప్రశ్నకు దానికి సమాధానం వచ్చి మూడు నెలలు అయిందని, ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగాయని అన్నారు. కేసీఆర్ గెలవడం కష్టమేనని కానిస్టేబుళ్లు అన్నారని గతంలో లగడపాటి అన్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా మాట దాటేసిన లగడపాటి సీఎం కేసీఆర్ తాజా ఎన్నికల్లో గెలుస్తాడో లేదో తెలిసినప్పటికీ కూటమి కోసం మాట దాటేసినట్టు భావిస్తున్నారు.

Related News