Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన లగడపాటి .....నేను బోగస్ సర్వే లు చేయను ...!

Category : politics

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ మాజీ కీలక నేత లగడపాటి సర్వే ప్రస్తుతం తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారింది . ఆంధ్ర ఆక్టోపస్ గా పిలిచే ఈయన సర్వే చేస్తే , ఫలితాలలో ఏ మాత్రం తేడా రాదు అని అందరికి ప్రగాఢ నమ్మకం ఉంది . దీనికి టగట్టే గత ఎన్నికల్లో తెలంగాణాలో తెరాస , ఏపీ లో టీడీపీ అధికారం లోకి వస్తుంది అని చెప్పాడు . దానికి తగట్టే ఏపీ లో చంద్రబాబు నాయుడు , తెలంగాణ లో కెసిఆర్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు

కూటమికి అనుకూలంగా అబద్ధపు సర్వేలు వెల్లడిస్తున్నారంటూ మంగళవారం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై లగడపాటి రాజగోపాల్ స్పందించారు. తనకు పదవులు ముఖ్యం కాదనీ, వ్యక్తిత్వం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఒత్తిడితో సర్వేను మార్చానని కేటీఆర్‌ అనడం విడ్డూరమన్నారు. సెప్టెంబర్‌ 16న తన బంధువు ఇంట్లో కేటీఆర్‌ కలిశారన్నారు. ఆ సమయంలో సర్వే గురించి కేటీఆర్‌ తనను అడిగారన్నారు. సర్వే రిపోర్టులు పంపిస్తానంటే కేటీఆర్‌ మెయిల్‌ అడ్రస్‌ ఇచ్చారని వెల్లడించారు.

కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, కోదండరాం విడివిడిగా ఉన్నప్పుడు ఆ సర్వే చేశామనీ, వారందరూ కలిస్తే పోటాపోటీగా ఉంటుందని చెప్పానని లగడపాటి వివరించారు. వీలుంటే పొత్తులతో వెళ్లాలని కేటీఆర్‌కు తాను సలహా ఇచ్చానన్నారు.

కానీ కేటీఆర్‌ మాత్రం సింగిల్‌గానే వెళ్తామని చెప్పారన్నారు. 65 శాతం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని కేటీఆర్‌కు చెప్పానన్నారు. కేటీఆర్‌ 23 నియోజకవర్గాల జాబితా పంపించి సర్వే ఫలితాలు కోరారన్నారు. నవంబర్‌ 11న కేటీఆర్‌ మరో 37 నియోజకవర్గాల జాబితా పంపారని తెలిపారు. కేటీఆర్‌ కోరిన 37 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉందని లగడపాటి వెల్లడించారు. చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, అభ్యర్థులను మార్చకపోతే నష్టం వచ్చే అవకాశం ఉందని తాను కేటీఆర్‌కు ముందే చెప్పానని లగడపాటి తెలిపారు .