//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శబరిమల ఆలయంలోకి చొచ్చుకేల్లెందుకు ఆంధ్రా మహిళ యత్నం

Category : national

కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల గుడిలోకి వెళ్లేందుకు ఓ మహిళ విఫలయత్నం చేసింది.

అయితే శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి యత్నించిన ఆ మహిళను పోలీసులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పార్వతి(31) భర్త, పిల్లలు, మరో 11 మందితో కలిసి ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించారని పోలీసులు తెలిపారు.

శబరిమలలో 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ సతీష్ బినో మాట్లాడుతూ, పదినెంట్టాంపడిని ఎక్కుతుండగా ఓ మహిళను అడ్డుకున్నామని, ఆమె వద్ద ఉన్న గుర్తింపు కార్డు ప్రకారం ఆ మహిళకు 31 సంవత్సరాలని, నిర్ధారణకు వచ్చామని చెప్పారు. 10 నుంచి 50 ఏళ్ల వయసున్న స్త్రీలెవరికీ ఆలయంలోకి ప్రవేశం లేదని పేర్కొన్నారు.

ఏపీకి చెందిన ఆ మహిళ తన కుటుంబసభ్యులతో వచ్చినట్టు గుర్తించారని, సాధారణంగా శబరిమలకు వచ్చే మహిళల గుర్తింపు కార్డులను తనిఖీ చేసి, అనంతరం, కొండపైకి అనుమతిస్తామని చెప్పారు. అసలు, ఆ మహిళ పదునెట్టాంపడి వరకూ ఎలా వచ్చిందో అర్థం కాలేదని ఆలయ అధికారులు పేర్కొన్నారు.