//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హైదరాబాద్ లో యువతి దారుణ హత్య !

Category : state

హైదరాబాద్ లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి, దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి జరిగింది.

వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లోని మూసాపేట్‌ హబీబ్‌నగర్‌లో బోను జానకి అనే యువతి దారుణహత్యకు గురైంది. మంగళవారం( జనవరి-9) రాత్రి యువతి నిద్రిస్తున్న గదిలోకి ప్రవేశించిన దుండగుడు ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన జానకి అనే యువతి మూసాపేట్ హబీబ్ నగర్ లో ఉంటోంది. కూకట్ పల్లిలోని డీమార్ట్ లో ఆమె పని చేస్తోంది. ఆమెను ఆనంద్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించేవాడని ఆమె స్నేహితురాళ్లు తెలిపారు. ప్రేమించకపోతే చంపేస్తానంటూ గతంలో అనేక సార్లు బెదిరించాడని, అతనే జానకిని హత్య చేసి ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రేమను నిరాకరించిన పాపానికి యువతిని దారుణంగా హత్య చేసి పరారయ్యాడని చెబుతున్నారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం గుయ్యనవలస గ్రామానికి చెందిన బోను జానకి(24) కేపీహెచ్‌బీలోని డీమార్ట్‌ సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తోంది.

మూసాపేట హబీబ్‌నగర్‌లో ఓ అద్దె ఇంట్లో రూప అనే మరో యువతితో కలసి ఉంటోంది. జానకి పనిచేస్తున్న సూపర్‌మార్కెట్‌లోనే రంగారెడ్డి జిల్లా పెద్దేముల్‌ సమీపంలోని మారెపల్లి గ్రామానికి చెందిన అనంతప్ప అలియాస్‌ ఆనంద్‌ కూడా పనిచేస్తున్నాడు. గత కొద్దికాలంగా తనను ప్రేమించాలంటూ జానకిని వేధిస్తున్నాడు. అయితే అతడి ప్రేమను జానకి తిరస్కరించింది. దీంతో 10 రోజుల క్రితం జానకి ఇంటికి వెళ్లి తనను ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించి వెళ్లాడు.

ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం రూప ఇంటికి వచ్చేసరికి గదిలో జానకి అపస్మారకస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆమె కడుపులో కత్తితో పొడిచిన గాయాలున్నాయి. దీంతో స్థానికులు జానకిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి జానకి మృతిచెందింది. నిందితుడు పరారీలో ఉన్నట్లు కూకట్‌పల్లి సీఐ వడ్డే ప్రసన్నకుమార్‌ తెలిపారు.