//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎల్ రమణ అరెస్ట్

Category : state

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ పోలీసులు గృహ నిర్బంధం చేసినట్టు సమాచారం. ఆయనతో పాటు కేపీహెచ్ బీ కాలనీలో నివాసం ఉండే మరో నేత, గ్రేటర్ హైదరాబాద్ లో తెలుగుదేశానికి ఉన్న ఏకైక కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావును కూడా హౌస్ అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే, తెలుగు రైతు అధ్యక్షుడు వంటేరు ప్రతాప్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దీంతో, దీంతో ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి సీఎం క్యాంప్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీకి టీడీపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. వంటేరుపై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశాయి.

దీంతో, ఈ ర్యాలీని భగ్నం చేసే క్రమంలో టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని, నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రజా హక్కులను హరించి వేస్తుందని టిటిడిపి నేతలు ధ్వజమెత్తారు.