ఓటమి, విజయంతో సంబంధం లేకుండా అభిమానుల మనస్సు గెలుచుకునే ఆటగాళ్లలో ముందుడే ఆటగాడు AB డివిలియర్స్. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో తన బ్యాటింగ్ విన్యాసాలతో అలరించాడు AB. ఈ మ్యాచ్ లో బెంగుళూర్ ఓడిపోయినా AB ఆట ముందు అది కనబడలేదు అభిమానులకు.
బెంగుళూరు నిర్దేశించిన 148 పరుగుల లక్షాన్ని పంజాబ్ కేవలం 2 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. హషీమ్ ఆమ్లా (58 నాటౌట్, 38 బంతుల్లో 4*4, 3*6), మాక్స్ వెల్ (43 నాటౌట్ ,22 బంతుల్లో 3*4, 4*6) రాణించడంతో పంజాబ్ వరుసగా తన రెండో విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన బెంగుళూర్ మొదటి ఓవర్లోనే వాట్సాన్(1) వికెట్ కోల్పోయింది. విష్ణు వినోద్ (7), ఖేదర్ జాదవ్ (1) కూడా త్వరలోనే ఔటయ్యారు. ఈ స్థితిలో క్రిజ్ లోకి వచ్చిన AB తనదైన శైలిలో కాకుండా నెమ్మదిగా పరుగులు చేశాడు. మన్ దీప్ సింగ్ (28), స్టువర్ట్ బిన్నీ (18*)లతో కలిసి జట్టుకు విలువైన పరుగులు అందించాడు. ఇక చివరి మూడు ఓవర్లలో AB రెచ్చిపోయి ఆడాడు. అతను మొత్తం (89 నాటౌట్; 46 బంతుల్లో 3×4, 9×6) లతో చెలరేగడంతో బెంగుళూర్ 148 పరుగులను ప్రత్యర్థి ముందు ఉంచింది.
ఛేదన ఆరంభించిన పంజాబ్ కు ఓపెనర్లు 62 పరుగుల భాగస్వామ్యంతో విజయానికి గట్టి పునాది వేశారు. 62 పరుగుల వద్ద వోహ్రా (34 , 21 బంతుల్లో 4*4 ,1*6 ) ఔటయ్యాడు. అక్బర్ పటేల్ (9) కూడా త్వరగానే ఔటయ్యాడు. తరువాత వచ్చిన మాక్స్ వెల్ ఆమ్లాతో పోటాపోటీగా పరుగులు చేశాడు. ఇంకా 33 బంతులుండగానే లక్షాన్ని పూర్తి చేశారు.
స్కోర్ వివరాలు
బెంగళూరు ఇన్నింగ్స్: వాట్సన్ (బి) అక్షర్‌పటేల్ 1; విష్ణు వినోద్ (సి) మాక్స్వెల్ (బి) సందీప్‌శర్మ 7; డివిలియర్స్ నాటౌట్ 89; జాదవ్ ఎల్బీ (బి) ఆరోన్ 1; మన్దీప్ (సి) సాహా (బి) ఆరోన్ 28; బిన్నీ నాటౌట్ 18; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 148; వికెట్ల పతనం: 1-2, 2-18, 3-22, 4-68;
బౌలింగ్: అక్షర్‌పటేల్ 4-0-12-1; సందీప్‌శర్మ 4-0-26-1; మోహిత్‌శర్మ 4-0-47-0; వరుణ్ ఆరోన్ 4-0-21-2; నటరాజన్ 1-0-13-0; స్టాయినిస్ 3-0-28-0
పంజాబ్ ఇన్నింగ్స్: వోహ్రా ఎల్బీ (బి) మిల్స్ 34; ఆమ్లా నాటౌట్ 58; అక్షర్ పటేల్ (బి) చాహల్ 9; మాక్స్వెల్ నాటౌట్ 43; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (14.3 ఓవర్లలో 2 వికెట్లకు) 150; వికెట్ల పతనం: 1-62, 2-78;
బౌలింగ్: స్టాన్లేక్ 4-0-41-0; ఇక్బాల్ అబ్దుల్లా 2-0-19-0; వాట్సన్ 2-0-28-0; మిల్స్ 2-0-22-1; చాహల్ 3.3-0-29-1; నేగి 1-0-7-0