//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రంగంలోకి కుమారస్వామి భార్య

Category : national politics

జెడిఎస్ నేత కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామి మొదటి భార్య అనిత(54) రామనగర ఉప ఎన్నికల బరిలో నిలవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ అనుభవం ఉన్న ఆమె ఈ ఎన్నికల బరిలో నిలవడంతో విజయం నల్లేరు మీద నడకే అనే అభిప్రాయం వినపడుతుంది. 1996లో కుమారస్వామి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో అనిత తొలిసారి ప్రచారానికి ఆరేళ్ల వయసున్న తన కొడుకును తల్లి ఇంట్లో వదిలి.. భర్త కోసం వచ్చారు. అప్పట్లో కనకపుర నియోజకవర్గంలో ఊరూరా పర్యటించి భర్తను గెలిపించారు.

ఆ తర్వాత ఆమె కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సరిగ్గా 12ఏళ్ల తర్వాత అంటే 2008లో ఆమె మధుగిరి నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల బరిలో నిలిచి గెలిచారు. మళ్ళి 5 ఏళ్ళకు 2013లో చెన్నపట్న నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో బెంగళూరు రూరల్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ సోదరుడు సురేష్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ రామనగర ఉప ఎన్నికల బరిలో నిలవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయారు.

Related News