//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడిని ఫాలో అవుతున్న ముఖ్యమంత్రి

Category : national politics

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రధాని నరేంద్ర మోడీని ఫాలో అవుతున్నారు. మోడీ తరహాలోనే అధికారిక కార్యక్రమాలకు మొబైల్ ఫోన్ లను అనుమతించడం లేదు. తన సమావేశాలకు అధికారులు మొబైల్ ఫోన్లు తీసుకురావడాన్ని నిషేధించినట్టు ఆయన కూడా అదే ఫాలో అయ్యారు. ప్రధాని మోదీ సమావేశాల మధ్యలో అధికారులు తరచూ సోషల్ మీడియా సైట్లను చెక్ చేసుకుంటూ కనిపించడంతో...

సమావేశాల్లో ఉన్నతాధికారులు సెల్‌ఫోన్లను వాడడంపై నిషేధం విధించారు. మోదీ తరహాలోనే తన సమావేశాల్లో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. మీటింగ్ జరుగుతున్నప్పుడు కొందరు అధికారులు సెల్‌పోన్లు చూస్తున్నారనీ.. దీని వల్ల ముఖ్యమైన విషయాలపై చర్చలకు ఇబ్బంది కలుగుతోందని కుమరస్వామి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఇకపై తాను ఎప్పుడు సమావేశాలకు పిలిచినా... అధికారులు తమవెంట మొబైల్ ఫోన్లను తీసుకురాకూడదని సీఎం సూచించారు.

Related News