//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కుమార స్వామి తప్పు చేసారు;దేవెగౌడ

Category : politics national

మాజీ ప్రధాన మంత్రి దేవేంద్ర గౌడ కాంగ్రెస్ జెడిఎస్ కూటమి విజయంపై హర్షం వ్యక్తం చేసారు. జేడీఎస్‌కు కాంగ్రెస్ బేషరతుగా మద్దతు ప్రకటించడంపట్ల సంతోషంగా ఉందని చెప్పారు. లౌకికవాద గుర్తింపుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుండటం చాలా చాలా సంతోషంగా ఉందన్న ఆయన జేడీఎస్‌కు మరికొన్ని స్థానాలు దక్కి ఉంటే బాగుండేదన్నారు. తమ పార్టీకి మెజారిటీ వస్తుందని ఎప్పుడూ ఆశించలేదన్నారు.

మతతత్త్వ శక్తులను ఆపగలిగినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. 2006లో కుమార స్వామి బీజేపీతో జట్టుకట్టడం వల్ల ఆయనకు చెడ్డ పేరు వచ్చిందన్నారు. ఇప్పుడు ఆ కళంకాన్ని ఆయన తుడిచేసుకోగలిగారన్నారు. తాను అప్పట్లో ఎంత బాధపడ్డానో కుమార స్వామి తెలుసుకున్నారన్నారు. ప్రస్తుత జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఐదేళ్ళు పరిపాలిస్తుందన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలన్నారు.

Related News