Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్‌భూషణ్‌ యాదవ్‌ కేసు

Category : world

నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ యాదవ్‌కు పాకిస్థాన్‌ సైనిక కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ శిక్ష సరైనది కాదని, శిక్షను నిలుపుదల చేయాలనీ ఎన్నిసార్లు పాకిస్తాన్ కి చెప్పిన ఫలితం లేకపోవడంతో భారత్ అంతర్జాతీయ న్యాస్థానాన్ని ఆశ్రయించింది. నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్‌,పాక్‌లు తమ వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఇరుదేశాలు దాదాపు 18 ఏళ్ల క్రితం ఇదే న్యాయస్థానంలో పాకిస్థాన్‌ నావికాదళానికి చెందిన యుద్ధ విమానాన్ని కూల్చివేసిన ఘటనలో వాదనలు వినిపించారు. ఆ కేసును అంతర్జాతీయ ధర్మాసనం 2000 జూన్‌ 21న కొట్టేసింది. నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ యాదవ్‌ గూఢచర్యానికి పాల్పడ్డారంటూ ఆయనకు పాకిస్థాన్‌ సైనిక న్యాయస్థానం మరణ దండన విధించింది. కుల్‌భూషణ్‌ యాదవ్‌కు న్యాయం చేయాలని ఈ నెల 8న అంతర్జాతీయ న్యాయస్థానాన్ని భారత్‌ ఆశ్రయించింది.

Related News