//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సీఎం గా కేటీఆర్ !

Category : politics

జాతీయ రాజకీయాల మీద ప్రధాని పదవి మీద తన కోరికని వెల్లడించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.

అయితే అనూహ్యంగా మూడో ఫ్రంట్ అనే వాదన తెర మీదకి తెచ్చి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొత్త కూటమిని ఏర్పాటు చేస్తానని కేసీఆర్ అంటున్నాడు. ఈ విషయంలో వివిధ పక్షాలతో చర్చలు జరుపుతున్నట్టుగా ఇప్పటికే ఝార్ఖండ్, బెంగాల్ సీఎం ఇతర ఎన్డీయే, యూపీఏయేతర పార్టీలతో చర్చలు జరుపుతున్నట్టుగా పేర్కొన్నాడు.

అయితే ఢిల్లీ పర్యటన కూడా త్వరలోనే ఉంటుందని, తెలంగాణ బిడ్డగా జాతీయ రాజకీయాల్లో సత్తా చాటతా అని కూడా కేసీఆర్ ప్రకటించాడు. అదే విధంగా తానూ రాష్ట్ర రాజకీయాల నుంచి వైదొలుగుతున్న వైనం గురించి, జాతీయ రాజకీయాల వైపు వెళ్తున్న వైనం గురించి కేసీఆర్ స్వయంగా వివరించుకున్నాడు. అయితే ఈ మాటలు వింటుంటే.. తెలంగాణ రాజకీయాల్లో కూడా మార్పులు తప్పవని రాజకీయాల మీద అవగాహన ఉన్న ఎవరికయినా అర్ధం అవుతుంది.

కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు మళ్ళుతున్న నేపథ్యంలో..తెలంగాణలో కూడా మార్పులు తప్పవని.. కేసీఆర్ స్థానంలో కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకుల విశ్లేషణ. ముఖ్యమంత్రి కాకపోయినా సరే తెలంగాణ పాలనలో కేటీఆర్ మార్కు గట్టిగానే ఉందనే విషయం అర్ధమవుతోంది.

పాలన అంతా కేటీఆర్ తన మార్కుతో నడిపిస్తూ ఉన్నాడని, మొత్తం ప్రభుత్వంపై గ్రిప్ కలిగి ఉన్నాడనే మాట తెలంగాణలో వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు కేటీఆర్ లాంఛనంగా ముఖ్యమంత్రి అయినా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. కేసీఆర్ తనకు తానుగా జాతీయ రాజకీయాల వైపు వెళ్తున్నట్టుగా ప్రకటించుకున్నాడు కాబట్టి... తెలంగాణ సీఎంగా కేటీఅర్ కి లైన్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది.

Related News