Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ల‌తో మంత్రి కేటీఆర్ టెలీ కాన్ఫ‌రెన్స్‌..! ఏం మాట్లాడుకున్నారో తెలిస్తే షాక‌వుతారు..!!

Category : politics state

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో హాట్ టాపిక్ ఏమిట‌య్యా..? అని ఎవ‌రినైనా ప్ర‌శ్నిస్తే .. వెంట‌నే వారు చెప్పే స‌మాధానం ఏంటో తెలుసా..? నీకేమ‌న్నా పిచ్చా..! తెలిసి అడుగుతున్నావా...? తెలియ‌క అడుగుతున్నావా..? తెలంగాణ‌లో హాట్ టాపిక్ ముంద‌స్తు ఎన్నిక‌లేగా..! అని, అంతేకాకుండా, అడక్కుండానే చెప్పే మ‌రో మాట ఏమిటో తెలుసా..? అయినా.. ఈ కేసీఆర్ సారూ ప్ర‌భుత్వాన్ని ఎందుకు ర‌ద్దు చేశాడో..? ఏమో..? పైవాడికే ఎరుక‌..! ఆ విష‌యం ఇప్ప‌టికీ అర్థం కావ‌డం లేద‌ని. ఇలా సామాన్యుడికి సైతం అర్థం కాని రీతిలో కేసీఆర్ త‌న ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేశార‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

ఇదిలా ఉండ‌గా, తెలంగాణ‌లో అవినీతి పెరిగి పోయింది.. ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఆయ‌న మంత్రివ‌ర్గం చెబుతున్న మాట‌ల్లో ఉన్న అభివృద్ధి.. చేత‌ల్లో క‌నిపించ‌డం లేదు. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నామ‌ని చెప్పుకుంటున్న ప్ర‌స్తుత తెలంగాణ ప్ర‌భుత్వం .. వాటి ఫ‌లితాల‌ను కేవ‌లం టీఆర్ఎస్ నేత‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కే అందేలా అమ‌లు చేస్తుంది, అంతేకాకుండా, టీఆర్ఎస్ చేప‌ట్టిన మిష‌న్ భ‌గీర‌థ‌, మిష‌న్ కాక‌తీయ‌, కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణం, రైతు బంధు, కంటి వెలుగు, తెలంగాణ‌కు హ‌రిత‌హారం ఇలా సీఎం కేసీఆర్ ఏ ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టినా అందుకు కేటాయించిన నిధుల్లో మంత్రుల‌కు, నేత‌ల‌కు వాటా వెళ్లాల్సిందే అంటూ ఇటీవ‌ల కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక‌ను వెల్ల‌డించిన విషయం తెలిసిందే. అంతకు ముందే, తెలంగాణ ప్ర‌తిప‌క్ష పార్టీలు టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం ఇలా అధికార పార్టీ మిన‌హా ప్ర‌తీ ఒక్క పార్టీ ఈ విష‌యాల‌ను మీడియా ముందు ఆధారాల‌తో స‌హా వెల్ల‌డించాయి.

ఇలా, కాగ్ వెల్ల‌డించిన తెలంగాణ స‌ర్కార్‌ అవినీతి నివేదిక ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌క ముందే, ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేస్తే మంచిద‌ని అభిప్రాయ‌ప‌డ్డ కేసీఆర్.. ఉన్న ప‌లంగా ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేశారు. ఈ విష‌యం పాఠ‌కులంద‌రికీ విధిత‌మే. ఇలా కేసీఆర్ ప‌న్నిన కుట్ర‌ను ఎదుర్కొనేందుకు, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అవినీతి ప్ర‌భుత్వాన్ని దూరం చేసేందుకే తామంతా మ‌హాకూట‌మిగా ఏర్ప‌డ్డామ‌ని కాంగ్రెస్‌, టీడీపీ స‌హా ప్ర‌తిప‌క్షాల‌న్నీ గ‌ళ‌మెత్తాయి. మ‌రో ప‌క్క సీఎం చంద్ర‌బాబు సైతం తెలంగాణ‌లో జ‌రుగుతున్న అవినీతిపై ఎప్ప‌టిక‌ప్పుడు ధ్వ‌జ‌మెత్తుతూనే, కేసీఆర్ అవినీతిని త‌న పార్టీ నేత‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ఉన్నారు.

ఇప్పుడు ఈ అంశ‌మే కేసీఆర్‌కు చిర్రొత్తుకొచ్చేలా చేసింది. ఈ క్ర‌మంలోనే కేసీఆర్‌ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై ఎప్ప‌ట్నుంచో క‌క్ష క‌ట్టిన మోడీతో చేతులు క‌లిపారు. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయ‌క ముందు ఢిల్లీలో ప‌ర్య‌టించిన కేసీఆర్ ఈ విష‌యంపైనే మోడీతో చ‌ర్చించార‌ట‌. ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఎలాగైనా అడ్డుక‌ట్ట వేయాల‌ని ఆ నాడే చ‌ర్చించార‌ట‌. ఆ స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ ఇచ్చిన స‌ల‌హాను.. ఇప్పుడు సీఎం కేసీఆర్ అమ‌లు చేస్తున్నారు.

ఇంత‌కీ ఆ స‌ల‌హా ఏంటంటే..? వైసీపీ, జ‌న‌సేన క‌ల‌వ‌డం..! అవును, మీరు చ‌దివింది నిజ‌మే. వైసీపీని, జ‌న‌సేన‌ను క‌లిపగ‌లిగితే, చంద్ర‌బాబు నీ జోలికి రాడంటూ ప్ర‌ధాని మోడీ కేసీఆర్‌కు సూచించార‌ట‌. ఆ క్ర‌మంలోనే, సీఎం కేసీఆర్ త‌న కుమారుడు, మంత్రి కేటీఆర్‌తో ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌కు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఫోన్ చేయించార‌ట‌. ఇద్ద‌రూ కూడా విడి విడిగా పోటీ చేస్తే 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం క‌ష్ట‌మ‌ని, ఇద్ద‌రూ క‌ల‌సి పోటీ చేస్తేనే మీ పార్టీల‌కే ఏపీలో భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని మంత్రి కేటీఆర్ జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ల‌కు ఫోన్‌లో వివ‌రించారు.

మంత్రి కేటీఆర్ అలా వారిద్ద‌రితో ఫోన్‌లో మాట్లాడారో లేదో.. ఇలా జ‌గ‌న్‌, ప‌వ‌న్ స్వ‌రం ఒక్క‌సారిగా మారి పోయింది. అప్ప‌టి వ‌ర‌కు బ‌ద్ధ‌శ‌త్రువులుగా ఉన్న ప‌వ‌న్‌, జ‌గ‌న్ ఒక్క‌సారిగా తమ స్వ‌రాన్ని స‌వ‌రించుకున్నారు. జ‌గ‌న్‌పై నాకు ఎటువంటి క‌క్ష లేద‌ని ప‌వ‌న్ చెబితే.. ఆ స‌మాచారాన్ని త‌న పార్టీ నేత‌ల త్వారా తెలుసుకుని చిరున‌వ్వులు చిందించ‌డం జ‌గ‌న్ వంతైంది. ఇలా ఒక‌రిపై మ‌రొకరు ప్రేమ‌ను ఒల‌కబోసుకుంటున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి వీరి బంధం 2019 ఎన్నిక‌ల వ‌ర‌కు కొన‌సాగుతుందో..? లేదో...? తెలుసుకోవాలంటే.. అప్ప‌టి వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

Related News