//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలంగాణ ఇచ్చింది అమ్మ కాదు.. బొమ్మ కాదు..కేటీర్ సంచలన వ్యాఖ్యలు...!

Category : state politics

కాంగ్రెస్‌పై మరోసారి మంత్రి కేటీఆర్ నిప్పులుచెరిగారు. కాంగ్రెస్ దేశాన్ని, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ధ్వజమెత్తారు. ఆనాడు తెలంగాణకు.. ఆంధ్రాకు కాంగ్రెస్ బలవంతపు పెళ్లి చేసిందని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మంత్రి సమక్షంలో ఆర్య వైశ్య నేతలు టీఆర్ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అమ్మ కాదు.. బొమ్మ కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కృషి.. వందలాది మంది బలిదానాలతో తెలంగాణ వచ్చిందని చెప్పారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహం ఇంతా అంతా కాదన్నారు.

ఇంటింటికీ నీళ్లివ్వడం ఖాయమన్నారు. కాంగ్రెస్సోళ్ల కిందకు కూడా నీళ్లు తెచ్చుడు పక్కా అని చెప్పుకొచ్చారు. ఇంకో 15 ఏళ్లు తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని చెప్పారు. కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని తెలిపారు. ఎన్నికల కాలం వచ్చిందంటే గాలి మాటలు వినిపిస్తాయన్నారు.

నోటికి ఏది వస్తే అది మాట్లాడే నాయకులొస్తారన్నారు. అవసరం అయితే ఇంటింటికీ తులం బంగారం కూడా ఇస్తామంటారు.. ఇలాంటోళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు

Related News