Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

షాకింగ్ ... ఆ ముగ్గురు కాంగ్రెస్ కీలక నేతల ఓటమిపై క్లారిటీ ఉందన్న కేటీఆర్

Category : politics

తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికలు పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్ది ఆయా రాజకీయ పార్టీల నేతలు తమ రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. విమర్శలకు పదునుపెడుతున్నారు. దూకుడు చూపిస్తున్నారు. ఎవరికి వారు ట్రెండ్ తమకు అనుకూలం గా ఉన్నట్టు చెప్తున్నారు. తమ సత్తాను చాటుకునేలా ప్రత్యర్ధి పార్టీలపై ఎదురుదాడిని కొనసాగిస్తున్నారు. ఈ పరంపరంలో టీఆర్ ఎస్ పార్టీ నేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ బలాబలాల గురించి విశ్లేషిస్తూనే...తమ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ ముఖ్య నేతల గురించి సంచలన విషయాలను ఆయన వెల్లడించారు. టీఆర్ ఎస్ కు చెందిన అగ్రనేతలు ఈ దఫా ఓటమి ఖాయమని ఢంకా బజాయించి మరీ కేటీఆర్ వెల్లడించడం సంచలనంగా మారింది.

హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో టీఆర్ ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు ముందు మంత్రి కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఓటమి భయంతోనే రేవంత్ డ్రామాలు మొదలు పెట్టాడని విమర్శించారు. రోజుకో ఆరోపణల అంతర్యం అదేనని ఆయన చెప్పుకొచ్చారు. కొడంగల్ లో గెలవలేక ఎన్నికలను వాయిదా వేయించాలని రేవంత్ ప్రయత్నాలు చేస్తూన్నారని ఆరోపించారు. రేవంత్ సహా కాంగ్రెస్ కు చెందిన ముఖ్యనేతలు రాబోయే ఎన్నికల్లో ఓటమి పాలు కానున్నారని కేటీఆర్ వెల్లడించారు. నాగర్జునసాగర్ లో తాజా మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, కొడంగల్ లో రేవంత్ రెడ్డి, మధిరలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క ఓడిపోవడం ఖాయమని కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ నేతలకు తమ ఓటమి గురించి ముందే తెలిసిపోయిందని అందుకే నియోజకవర్గం దాటి బయట అడుగుపెట్టడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆ ముగుఉరి ఓటమి పై తనకు ఫుల్ కల్రితీ వుందని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ గురించి కేటీఆర్ ఆసక్తికరమైన లెక్కలు చెప్పారు. గ్రేటర్ లో 17స్థానాలు టీఆర్ ఎస్ గెలువబోతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రెండు స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందేనని కాంగ్రెస్ ఒక్కచోట కూడా గెలవడం లేదని తెలిఫై షాక్ కు గురి చేశారు . మహిళలు ,ముస్లింలు పూర్తిగా టీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పిన ఆయన సెటిలర్లంతా కారు వైపే ఉన్నారని స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ లలో టీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమని పేర్కొన్న కేటీఆర్ చంద్రబాబు తెలంగాణలో ఎంత తాపత్రయపడ్డా ప్రయోజనం శూన్యం అని చెప్పారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా తిరుగుతానని వచ్చే ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబుకు చెక్ పెడతామని చెప్పారు. అక్కడా రాజకీయాలు చేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్ గెలిచే స్థానాలను బట్టి మా వ్యూహం ఉంటుందని వెల్లడించారు. చివరి రోజున ఎవరి నియోజకవర్గాల్లో వారే ప్రచారం చేసుకుంటారని తెలిపారు. సిరిసిల్లలో ఈ సారి కూడా 50 వేల మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి ఎన్నికల సరళిపై ఒక క్లారిటీ ఉన్నట్టు మాట్లాడిన కేటీఆర్ చెప్పినవి ఏమేరకు జరుగుతాయో వేచి చూడాలి.

Related News