//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేటీఆర్ ఫోన్ కాల్ కు సీనియర్ నేతల ఉరుకులు ... ఎందుకో తెలుసా

Category : state politics

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీలోని నేతలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఒకపక్క మంత్రివర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో కేటీఆర్ తో సఖ్యంగా లేకుంటే తమ పరిస్థితి ఏమవుతుందోనని భయపడుతున్న సీనియర్లు కేటీఆర్ ఫోన్ కాల్ వస్తే చాలు పరుగులు పెడుతున్నారట.

నిన్న మొన్నటి దాకా కెసిఆర్ తర్వాతే కేటీఆర్ అని భావించిన వారు తాజా పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ అంటేనే ఎక్కువ భయపడిపోతున్నారట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లోనూ పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న కేటీఆర్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఆయా జిల్లాలలోని నేతలకు ఫోన్ కాల్స్ చేసి పార్టీ క్యాడర్ ను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడుతున్నారు.

ఒకప్పుడు కేటీఆర్ కాల్ చేసిన చాలా కులాసాగా మాట్లాడిన సీనియర్లు ఇప్పుడు కేటీఆర్ కాల్ వస్తే చాలా వినయవిధేయతలతో మాట్లాడుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సీనియర్ నేతల ప్రవర్తనలో చెప్పలేనంత మార్పు వచ్చింది. కేటీఆర్ కు నచ్చితేనే ఏ పదవి అయినా దక్కుతుంది అని భావిస్తున్న తరుణంలో కేటీఆర్ కాల్ వస్తే చాలు ఆయన కలవాలి అన్న కబురు వస్తే చాలు ఉరుకులు పరుగుల మీద ఆయన ముందుంటున్నారు.

అదే గతంలో అయితే చాలా తీరిగ్గా కాస్త నిదానంగా సమయం చూసుకొని కలిసి నటు వంటి నేతలు ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రవర్తించాల్సి వస్తోంది. ఒకప్పుడు అన్నా మాట్లాడాలి ఎప్పుడొస్తారు అని కేటీఆర్ కాల్ చేస్తే వల్ల షెడ్యూల్ చూసుకొని నిదానంగా కలుస్తామని చెప్పారు. ఇక ఇప్పుడు కేటీఆర్ కాల్ చేసి అన్న మాట్లాడాలి ఎప్పుడొస్తారు అంటే ఇదిగో వెంటనే బయలుదేరుతున్నాం అని చెప్తున్న పరిస్థితి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకు హోదా దక్కిన ప్పటి నుంచి ఇక మంత్రి పదవుల కోసం పాకులాడుతున్న సీనియర్లు కేటీఆర్ కాల్ వస్తే చాలు అక్కడ వాలి పోతున్నారట. అందుకే అంటారు పదవి ఉంటే ఏదైనా చెయ్యచ్చు అని.