Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఒక సినిమా ఫ్లాపైనా ఇంకో సినిమా హిట్ అయ్యింది అంటున్న కృతిసనన్

Category : movies

ఓ పక్క మోడలింగ్‌ చేస్తూనే సినిమా అవకాశాల కోసం కష్టపడ్డారు కృతి సనన్‌. తొలి సినిమాలో అవకాశం వచ్చినా అది ఫ్లాపైంది. అయినా నిరాశ చెందకుండా స్వశక్తిని నమ్ముకుని బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అక్కడ తొలి సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవ్వడంతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు కృతి సనన్‌. ఇప్పుడు అగ్ర కథానాయికల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు కృతి సనన్‌. తక్కువ కాలంలోనే ఎందరో అభిమానుల మనసు గెలుచుకున్న ఈ భామ ఈరోజు తన 29వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు.

కృతి నటించిన సినిమాలు ఒక ఎత్తైతే.. ఆ సినిమాల్లోని కొన్ని పాటలు మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. ప్రేక్షకులకు ఈ సాంగ్స్‌ బాగా చేరువై ఉర్రూతలూగించాయి. ఆ పాటలేంటో ఓసారి మనమూ విందామా..ఆ తుజో మోగ్‌ కోర్తా..కృతి నటించిన తొలి చిత్రం 'నేనొక్కడినే' చిత్రంలోని పాట ఇది. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అంత హిట్ అవ్వలేదు కానీ.. పాటలకు మంచి ఆదరణ లభించింది. అందులోనూ కృతి, మహేశ్‌ కలిసి బీచ్‌ దగ్గర పాడే 'ఆ తుజో మోగ్‌కోర్తా' పాటకు విపరీతమైన స్పందన వచ్చింది.