//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

క్రిష్ బర్త్ డే స్పెషల్ ఆర్టికల్

Category : movies

కృష్ణ జాగర్లమూడి( క్రిష్ ) ది మోస్ట్ క్రియేటివ్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్. గమ్యం సినిమా తో తెలుగు తెరకి డెబ్యూ డైరెక్టర్ గా పరిచయమై మొదటి సినిమాతోనే బెస్ట్ డైరెక్టర్ గా నంది అవార్డు , ఫిలిం ఫేర్ అవార్డు సాధించారు. ఆయన సినిమాలలో ఎప్పుడు కమర్షియల్ హంగులు పోరు. ఆయన తీసిన సినిమా రియాలిటీ కి దగ్గరగా ఉంటూనే మనుషులని ఆలోచింపచేసేలా ఆయన సినిమా లో కథ ఉంటుంది. సమాజం లో జరిగే వాస్తవ సంఘటనల ఆధారంగా క్రిష్ సరికొత్త కథనాలతో తన సినిమాని ఆశక్తికరంగా నడిపిస్తాడు. Krish birthday special Article

దానికి ఆయన తెరకెక్కించి మల్టీ స్టార్రర్ మూవీ వేదం మంచి ఉదాహరణ. ఐదు కథలతో నడిపించిన ఒక సంఘటన తో ఆ ఐదు కథలని ముడివేసిన విధానం ఆమొగం.వేదం సినిమాలో పాత్రలు సినిమాకి ప్రాణం పోశాయి. ఈ సినిమా తో కూడా క్రిష్ ఫిలిం ఫేర్ అవార్డు ఫర్ బెస్ట్ డైరెక్టర్ సాధించాడు. ఆయన క్రియేటివిటీ తో తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ్, హిందీ లో కూడా ఆయన సత్త చాటాడు.క్రిష్ వేదం మూవీ ని తమిళ్ లో వెన్నం గా శింబు, భారత్ తో రీమేక్ చేసాడు.కృష్ణం వందే జగద్గురుమ్ , కంచె సినిమాలతో తన మార్క్ మరోమారు తెలుగు సినిమా పై వేసాడు. క్రిష్ ఎప్పటివరకు ఒకదానితో మరొకటి సంభంధం లేని కథలే చేసాడు. నందమూరి బాలకృష్ణ తో గౌతమిపుత్ర శాతకర్ణి బయోపిక్ చేసి క్రిష్ తన ఉనికి చాటుకున్నాడు.తెలుగు చిత్ర పరిశ్రమకు ఎటువంటి డైరెక్టర్లు మరెందరో రావాలి. రాబోయే యువతరం దర్శకులకు క్రిష్ ఒక ఇన్స్పిరేషన్.Krish birthday special Article

ఇప్పటివరకు ఆయన కెరీర్ లో ఒక నంది అవార్డు, మూడు ఫిలిం ఫేర్ అవార్డులు సాధించగా , మూడు సార్లు ఫిలిం ఫేర్ కి నామినెటే అయ్యారు.ప్రస్తుతం తెలుగు లో ఎన్టీఆర్ జీవితం ఆదరంగా నందమూరి బాలకృష్ణ తో ఎన్టీఆర్ బయోపిక్ ను చరిత్రకెక్కించే పనిలో వున్నారు. ఈ చిత్రాన్ని కథానాయకుడు, మహానాయడు అని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఇది సంక్రాంతి కి తెలుగు ప్రేక్షకుల ముందుకు ముందుకు వస్తుంది.దేనితో పాటు క్రిష్ బాలీవుడ్ లో కంగనా రౌనత్ హీరోయిన్ గా జాన్సీ లక్ష్మి భాయ్ బయోపిక్ ను మణికర్ణికా గా తీర్చిదిద్దుతున్నాడు. ముందు.. ముందు... ఇలాంటివి మరెన్నో చిత్రం ముందుకు తీసుకురావాలని , మరెన్నో అవార్డులు క్రిష్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాధాకృష్ణ జాగర్లమూడి గార్కి జన్మదిన శుభాకాంక్షలు.Krish birthday special Article