//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పంజాబ్ లో ఉగ్రవాదం అణచివేసిన కేపీఎస్‌ గిల్‌ మృతి

Category : national

పంజాబ్ లో ఉగ్రవాదాన్ని అణచి వేయడంలో క్రియాశీల పాత్ర పోషించిన  పంజాబ్‌ మాజీ డీజీపీ కేపీఎస్‌ గిల్‌(82) గుండెపోటుతో కన్నుమూశారు. దిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. 

గత కొంత కాలంగా ఆయన మూత్రపిండాలు, హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని వైద్యులు చెప్పారు.  ప్రపంచం మొత్తంలో ఉగ్రవాదాన్ని సైన్యం ప్రమేయం లేకుండా సాధారణ పోలీసులు ఉక్కు పాదంతో అణచి వేసింది పంజాబ్ లోనే కావడం గమనార్హం.  ఆయన అందించిన సేవలకు గాను 1989లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 

1958లో పోలీస్‌ శాఖలో తన కెరీర్‌ ఆరంభించిన గిల్‌ తొలుత అసోం, మేఘాలయల్లో పనిచేశారు. 1980ల్లో అసోం ఐజీగా పనిచేశారు. అనంతరం1988 నుంచి 1990 వరకూ తిరిగి 1991 నుంచి ఉద్యోగ విరమణ చేసేవరకూ పంజాబ్‌ డీజీపీగా పనిచేశారు. 

1988లో స్వర్ణ దేవాలయంలోకి కొందరు ఉగ్రవాదులు చొరబడిన సమయంలో ‘ఆపరేషన్‌ బ్లాక్‌ థండర్‌’ను విజయవంతంగా చేపట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం కాలంలో గిల్‌ భారత హాకీ సమాఖ్య అధ్యక్షుడిగానూ వ్యవహరించారు