Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తిదాయకం అన్న కోవింద్

Posted 5 months ago | Category : national

జాతికే ఆంధ్రప్రదేశ్‌ స్ఫూర్తిదాయకమని భారత రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ కొనియాడారు. రాష్ట్రపతిగా గెలుపొందిన తరువాత తొలిసారిగా శ్రీవారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా తిరుపతికి వచ్చిన ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిలో ఘనంగా `పౌరసన్మానం' చేసింది. ఎన్టీ రామారావు, పివి నరసింహారావు వంటి మహానీయులను అందించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్రపతి గుర్తు చేశారు.

తాను రాష్ట్రపతి అయిన తరువాత జమ్మూకాశ్మీర్‌కు వెళ్లానని, ఆ తరువాత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి రావడం తన రెండో పర్యటన అని చెబుతూ తాను కిందిస్థాయి నుంచి వచ్చి భారత ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగానని సంతోషం వ్యక్తం చేశారు.  ఇదంతా అంబేద్కర్‌ ఆశయ సాధన వల్లే సాధ్యమయ్యిందని స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్‌ వల్లనే పేదరికంలో ఉన్న తాను చదివి అన్నింటిలోనూ రాణించినట్లు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఓ పక్క అభివృద్ధి, మరోపక్క సంక్షేమ పథకాలు సమపాళ్లలో అమలు జరుగుతున్నాయని రాష్ట్రపతి కొనియాడారు. చక్కగా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తన అభినందించారు. అంబేద్కర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణా కార్యక్రమాన్ని తన చేతులతో ప్రారంభించడం పట్ల సంతోషం ప్రకటించారు. స్టాండప్‌ ఇండియా కార్యక్రమాన్ని కేంద్రం తీసుకొచ్చిందని, ఈ కార్యక్రమం ద్వారా యువతకు ఉపాధే కాకుండా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని చెప్పారు. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ తెలుగువారు అన్ని రంగాల్లో ముందుకెడుతున్నారని కొనియాడారు.

అంతకు ముందు స్విమ్స్‌కు అనుబంధంగా నిర్మించిన పద్మావతి మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిని ప్రారంభించారు. రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ న్యాయానికి ప్రతినిధని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. ఎపుడూ పేదల పక్షానే ఆయన కార్యక్రమాలు ఉండేవన్నారు. ఇలాంటి గొప్పవ్యక్తి దేశానికి రాష్ట్రపతి కావడం గర్వకారణమన్నారు. అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఈ స్థాయికి ఎదిగిన రాష్ట్రపతి కోవింద్‌ ఎదిగారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్నికైన తరువాత తొలిసారిగా తిరుపతిలో ఆయనను సత్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. తిరుపతి శిల్పారామంలో ప్రభుత్వం అందించిన విందు కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted an hour ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే